-తొలి రోజు పరీక్షకు 98.27 శాతం మంది హాజరు విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు.వి IAS., గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గానూ 6,16,451 మంది విద్యార్థులు హాజరు కాగా, 10,826 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని …
Read More »Daily Archives: March 17, 2025
అత్యంత పారదర్శకంగా మైనింగ్ కార్యకలాపాలు
– ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీలు – నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా పటిష్ట పర్యవేక్షణతో నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇసుక లేదా మట్టి రవాణాకు సంబంధించి వచ్చే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదికల సమర్పణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. …
Read More »అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపండి
– మండల, డివిజన్ స్థాయిలోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహించండి – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 133 అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు నిబద్ధతతో కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, జెడ్‌పీ సీఈవో …
Read More »పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ గవర్నర్‌పేట సీవీఆర్ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నతపాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్ష …
Read More »ప్రాంతీయ స్థాయి CSSR పోటీ
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : 10వ బెటాలియన్ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) యొక్క ప్రాంతీయ స్థాయి (Regional Level) CSSR పోటీని 17 మార్చి, 2025 నుండి 18 మార్చి, 2025 వరకు నిర్వహిస్తోంది. ఈ పోటీ కూలిపోయిన నిర్మాణాల శోధన మరియు రెస్క్యూ కార్యకలాపాలపై (CSSR) దృష్టి సారిస్తుంది. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుండి ఒక్కొక్క రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం మరియు …
Read More »హస్తకళాకారులకు మార్కెట్ సౌకర్యానికి స్టాల్ ఇన్ మాల్..
-స్టాల్ ఇన్ మాల్ ద్వారా నిరుద్యోగులకు ఆర్ధిక ప్రయోజనం.. -నాబార్డ్ జియం డా. కెవిఎస్ ప్రసాద్ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణహస్తకళాకారులచే తయారు చేయబడిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశలు మెరుగు పరచాలనే లక్ష్యంతో స్టాల్ ఇన్ మాల్స్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని నాబార్డ్ జనరల్ మేనేజర్ డా. కెవిఎస్ ప్రసాద్ తెలిపారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పివిపి మాల్‌లో నిర్వహించిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శన అమ్మకాల ముగింపు కార్యక్రమానికి నాబార్డ్ …
Read More »పేదవాడి సొంత ఇంటి కల నెరవేరాలి…
-పేదల ఇంటి స్థలాల అర్జీలు బాధ్యతగా నెత్తిన మోస్తాం… -కమ్యూనిస్టుల పోరాట ఫలితమే ఇళ్ల స్థలాల సాధన… -సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్ట్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గం, పట్టణ సమితుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మంత్రి వర్గం సమావేశంలో తీర్మానం చేసి, జీవో విడుదల చేసిందని, దాని ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అర్జీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీపీఐ జిల్లా కార్యదర్శి దో …
Read More »చిట్టిపాలెం గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన జిల్లా కలెక్టర్
చిట్టిపాలెం (మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త : వేరువేరుగా తడి పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రతిరోజూ ఒక సమయాన్ని వీలుచేసుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి చెత్త సేకరణ పరిశీలించి ప్రజలకు స్వయంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం మచిలీపట్నం మండలం, అరిశేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో ఆయన దాదాపుగా …
Read More »అన్న క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులు ఉండకూడదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలో గల అన్న క్యాంటీన్లన్నిటిలోనూ ఎటువంటి మరమ్మతులు ఉండరాదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం మధ్యాహ్నం 18 వ డివిజన్ రాణిగారి తోట లో గల అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఎటువంటి మరమతులు ఉన్న వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని …
Read More »ప్రతి ఫిర్యాదును శాఖధిపతులు ఫీల్డ్ లెవెల్ లో పరిశీలించాలి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకునే ప్రతి సమస్యను శాఖధిపతులు ఫీల్డ్ లెవల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయాలలో సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార నిర్వహించారు కమిషనర్ ధ్యాన చంద్ర. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా వినడం, వాటికి …
Read More »