Breaking News

ప్రతి ఫిర్యాదును శాఖధిపతులు ఫీల్డ్ లెవెల్ లో పరిశీలించాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకునే ప్రతి సమస్యను శాఖధిపతులు ఫీల్డ్ లెవల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయాలలో సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార నిర్వహించారు కమిషనర్ ధ్యాన చంద్ర.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా వినడం, వాటికి తక్షణ పరిష్కారం కల్పించడం ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. పురపాలక సేవలు, రోడ్లు, మంచినీరు, మురుగు కాలువలు, గృహపథకాలు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అప్పగించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 31 ఫిర్యాదులను స్వీకరించారు. అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొకవల్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, సుప్రింటెంటింగ్ ఇంజనీర్లు టి సత్యనారాయణ పి సత్య కుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి బయాలజీ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *