Breaking News

Monthly Archives: April 2026

వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మెడికల్ క్యాంపు ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసిన ఏపీ BOCWA బోర్డు చైర్మన్ గొట్టుముక్కల. విజయవాడ( సెంట్రల్) కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేయడంతో ముఖ్యమంత్రి వైద్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత చూసి ప్రతి నియోజకవర్గంలో నాయకులు మెడికల్ క్యాంపులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31 డివిజన్ …

Read More »

డీజిల్ కొరత సృష్టిస్తే చర్యలు

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్, డీజిల్  కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ హెచ్చరించారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆదివారం రాత్రి ఆకస్మికంగా పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. బంకులలో నిల్వలను తనిఖీ చేశారు. ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు లోనవుతిన్నారని చెప్పారు. అవసరం లేకపోయినా డీజిల్‌ను నిల్వ …

Read More »

డీజిల్ పై ఆందోళన అవసరం లేదు

-వదంతులు వ్యాప్తి చేసే వారిపట్ల చర్యలు -వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. జిల్లాలో డీజిల్ కొరతపై వస్తున్న వదంతులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం …

Read More »

ఎండల తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, జిల్లాలోను 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల, జిల్లా కార్యాలయాల్లోనూ చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జనకూడలి ప్రదేశాల్లోనూ, …

Read More »

1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి… ఆర్జీల పరిస్థితి తెలుసుకోండి

-పి.జి.ఆర్.ఎస్ ను వినియోగించుకోండి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి, పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన ఆర్జీల పరిస్థితి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ దరఖాస్తులను పి.జి.ఆర్.ఎస్ తో పాటు మీకోసం”వెబ్ సైట్ లో ఆన్ లైన్ లోను సమర్పించవచ్చని తెలిపారు. అర్జీల వివరాలు Meekosam.ap.gov.in (మీకోసం డాట్ …

Read More »

పాత్రికేయులకు నిజాయితీయే కవచం

-ప్రముఖ జర్నలిస్టు ఎస్ వెంకట్ నారాయణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే ఎవరికి భయపడనవసరం లేదని, సమాజంలో తలెత్తుకు తిరగవచ్చని, అందరూ గౌరవిస్తారని ప్రముఖ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ్ (83) అభిప్రాయపడ్డారు.ఆయన ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ రాగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రెస్ క్లబ్ కు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన గత ఆరు దశాబ్దాల కాలంలో జర్నలిజంలో తన అనుభవాలను యూనియన్ నేతలతో పంచుకున్నారు. తాను ఇప్పటివరకు 68 దేశాల్లో పర్యటించానని, …

Read More »

కొత్తపేటలో రెండో రోజు సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తపేట లో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపు లో విశేషంగా ప్రజలు పాల్గొన్నారు.. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట కేబిఎన్ కళాశాలలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు ఆదివారం కూడా కొనసాగింది.., ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో 52, 53 డివిజన్ల ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం …

Read More »

2వ రోజు కొనసాగిన ఫ్యాప్టో నిరాహార దీక్ష

-ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాప్టో మలిదశ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 26వ తేది విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగిన నిరాహార దీక్ష విజయవంతమైనదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. దీక్షకు అధ్యక్షత వహించిన ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఏకీకృత …

Read More »

అసాధారణ పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడిన ప్రత్యేక ప్రతిభావంతులు

-అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు -విజయవంతంగా 21 మంది దివ్యాంగ విద్యార్థుల ఎవరెస్ట్ శిఖరారోహణ! -దివ్యాంగుల బృందంతో ట్రెక్కింగ్.. ప్రపంచంలోనే తొలిసారి -వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -అభినందించిన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ -హర్షం వ్యక్తం చేసిన విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు -“సరిగ్గా నడవలేడు, వినపడదు.. ఈ అబ్బాయి కొండలు ఎక్కుతాడా?” లేదా “ఇంత కష్టమైన పని నీకెందుకు, ఇంట్లో కూర్చోవచ్చు కదా” వెటకారపు మాటలు.. – ” దినసరి కూలీల …

Read More »

పెట్రోలు, డీజిల్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాం

-అపోహలు నమ్మవద్దు – అవసరానికి మించి కొనొద్దు -డిమాండ్ కు తగ్గట్లు సరఫరాకు ప్రభుత్వం చర్యలు -రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యం – బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ఇంధనానికి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని.. అపోహలు నమ్మవద్దని, ఆందోళనతో అవసరానికి మించి కొనుగోలు చేయవద్దు అని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. జిల్లాలో రోజువారీ …

Read More »