Breaking News

Daily Archives: May 14, 2026

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

-ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న ముఖ్యమంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. ఇక …

Read More »

రవాణా రంగానికి సహకారంతో పనిచేయాలి…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-AP Bus Oparators నూతన కార్యవర్గానికి మంత్రి మండిపల్లి అభినందనలు -రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బస్ ఆపరేటర్స్ కార్యవర్గ సభ్యులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఏపీ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సమావేశం అనంతరం ప్రెసిడెంట్ కిరణ్, వైస్ ప్రెసిడెంట్ నాని, కార్యదర్శి రాంబాబు, ట్రెజరర్ సందీప్‌తో …

Read More »

నాట్కో క్యాన్సర్ సెంటర్ కు రూ.30 కోట్లతో మరో లినాక్ రేడియేషన్ మెషిన్

-పెట్ స్కాన్ రాకతో లెవల్-1 స్థాయికి చేరిన గుంటూరు జీజీహెచ్ -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి -క్యాన్సర్ వైద్య సేవల మెరుగుకు, మరణాలు తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కృషి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)లోని ‘నాట్కో క్యాన్సర్ సెంటర్’ లెవల్-1 స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 18 కోట్లతో …

Read More »

శ్రీవాణి ట్రస్ట్‌లో వైసీపీ పాపాలను కడుగుతున్న కూటమి ప్రభుత్వం

-శ్రీవాణి ట్రస్ట్‌లో దళారుల వ్యవస్థను గుర్తించి, అరికట్టింది కూడా కూటమి ప్రభుత్వమే -వైసీపీ పెద్దలకు హిందూ మతంపై గౌరవం లేదు -ఆలయాల ధ్వంసం తప్ప, వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త ఆలయాన్ని కూడా నిర్మించలేదు -వైసీపీకి రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం నచ్చటం లేదు -బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవాణి ట్రస్ట్ పేరుతో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవకతవకలను కూటమి ప్రభుత్వం బయటపెడుతోందని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర …

Read More »

నగరంలో ‘నగ్నసత్యం రెడ్ బుక్’ సినిమా షూటింగ్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విఆర్పి క్రియేషన్స్ వారి ‘నగ్నసత్యం రెడ్ బుక్’ సినిమా షూటింగ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సారద్యంలో గురువారం విజయవాడలో క్లాప్ కొట్టి ప్రారంభించారు. “గడప దాటి రాని అమరావతి ఆడపడుచుల ఆవేదన, అసెంబ్లీ లో ఒక మహానుభావుడు కార్చిన కన్నీటి బొట్లు, ఒక మహాతల్లి కి జరిగిన అవమానం ప్రజలు మరచిపోలేని నగ్న సత్యం, ఆనాటి పబ్లిక్ లుక్… దేవుడిచ్చిన రెడ్ బుక్… తొక్కేయాలని చూస్తే నా మనవడి కాళ్ళు మొక్కెందుకు మీకు చేతులు కూడా …

Read More »

అధునాతన విధానాలలో ప్రజారాజధాని అమరావతి నిర్మాణం

– “MIVAN షట్టరింగ్” విధానంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో టవర్ల నిర్మాణం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరిగేందుకు APCRDA అధునాతన విధానాలను అమలు చేస్తోంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో పలు దేశాలలో అమలులో ఉన్న, నిర్మాణ రంగ నిపుణులు సైతం సూచిస్తున్న “MIVAN షట్టరింగ్” విధానాన్ని నిర్మాణ పనులలో వినియోగించడం ప్రారంభించింది. MIVAN షట్టరింగ్ విధానంలోని ముఖ్యాంశాలు: MIVAN షట్టరింగ్ అనేది ఆధునిక అల్యూమినియం ఫార్మ్‌వర్క్ సిస్టమ్. ఇది ముఖ్యంగా ఎత్తైన భవనాలు, భారీ గృహ నిర్మాణ …

Read More »

APCRDA ఆధ్వర్యంలో ఉచిత లైఫ్ సైన్సెస్ నైపుణ్య శిక్షణ & ఉద్యోగ అవకాశాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. లైఫ్ సైన్సెస్ స్కిల్ సెక్టార్ కౌన్సిల్ సహకారంతో రాజధాని యువతకు ఉచితంగా 3 నెలల నైపుణ్య శిక్షణతో పాటు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు APCRDA ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. స్వర్ణభారత్ ట్రస్ట్, ఆత్కూరు, కృష్ణా జిల్లాలో జరిగే ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌గా నిర్వహించబడుతోంది. …

Read More »

రైతుల సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తాం

-అబ్బరాజుపాలెం గ్రామసభలో APCRDA కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై అబ్బరాజుపాలెంలో APCRDA ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్, కె.కార్తీక్ ఐఏఎస్ హాజరయ్యారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం …

Read More »

జనసేన కేంద్ర కార్యాలయంలో రెండో రోజు జనవాణి – ప్రజల సమస్యల స్వీకరణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కూడా పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఆయన …

Read More »

సిల్ట్ తొలగింపు పనులు ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లలో మరియు అంతర్గత రోడ్లలోని డ్రైన్లలోని సిల్ట్ తొలగింపు పనులు ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం లోపే నగరంలోని అన్ని అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు నూరు శాతం పిన్ …

Read More »