Breaking News

Daily Archives: May 14, 2026

డెంగ్యూ వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డెంగ్యూ వ్యాధి నియంత్రణకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెల 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన పెంపొందించడం, దోమల నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా …

Read More »

అభివృద్ధి పనులను పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని బిఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను ఆగస్ట్ చివరికి పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో బిఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

రెండు రోజుల్లో ‘జన గణన 2027’ ఇళ్ల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి

-జన గణనపై అపోహలు వీడి ప్రజలందరూ సహకరించాలి -దేశాభివృద్ధికి మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జనగణన కీలకం -గురువారం శ్యామలా నగర్ లో జనగణని ప్రత్యక్ష్యంగా చేపట్టిన కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశాభివృద్ధికి మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు అత్యంత కీలకమైన ‘జన గణన 2027’ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. గురువారం శ్యామల నగర్ 9వ లైన్ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల …

Read More »

ఈ నెల 15న కుంటముక్క‌ల‌లో ప్ర‌త్యేక గ్రీవెన్స్‌

– స్థానిక ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వం ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే లక్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఈ నెల 15వ తేదీ శుక్ర‌వారం జి.కొండూరు మండ‌లం, కుంట‌ముక్క‌ల గ్రామంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని, స్థానిక ప్ర‌జ‌లు ఈ …

Read More »

పండ‌గ‌లా అంత‌ర్జాతీయ మ్యూజియం దినోత్స‌వ కార్య‌క్ర‌మాలు

– ఈ నెల 18న చారిత్ర‌క వైభ‌వాన్ని చాటిచెప్పేలా ఉత్స‌వాలు – విజ‌య‌వాడ బాపూ మ్యూజియంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములై విజ‌య‌వంతం చేయండి – వార‌స‌త్వ సంప‌ద‌కు నెల‌వైన మ్యూజియాల విశిష్ట‌త‌ను చాటిచెప్పండి – మీడియా స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌వ్య రాజ‌ధాని అమ‌రావ‌తికి గేట్ వే అయిన విజ‌య‌వాడ ప్రాంతంలో వినూత్న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి కృషిచేయ‌డం జ‌రుగుతోంద‌ని.. ఇందులో భాగంగా ఈ నెల 18న అంత‌ర్జాతీయ మ్యూజియం …

Read More »

క్రీడా సంస్కృతితో ఆరోగ్యవంతమైన సమాజం

– వేస‌వి క్రీడ‌ల శిక్ష‌ణ శిబిరాన్ని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడా సంస్కృతి ఆరోగ్య‌వంత‌మైన స‌మాజ నిర్మాణానికి ఉపయోగ‌ప‌డుతుంద‌ని.. క్రీడ‌ల‌ను ప్ర‌తిఒక్క‌రూ త‌మ జీవ‌న‌శైలిలో భాగంగా చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం న‌గ‌రంలోని ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలో జ‌రుగుతున్న క్రీడ‌ల శిబిరాన్ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సంద‌ర్శించారు. …

Read More »

పీఎం సూర్య‌ఘ‌ర్‌లో ప్ర‌గ‌తి క‌నిపించాల్సిందే

– ప్ర‌తి వారం స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హ‌ణ‌ – సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాలి – పీఎం కుసుమ్ ప‌థ‌కంపైనా ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం అమల్లో స్పష్టమైన పురోగతి కనిపించాల్సిందేనని, ప్ర‌తివారం స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో పీఎం సూర్య‌ఘ‌ర్‌, పీఎం కుసుమ్ ప‌థ‌కాల అమ‌లుపై స‌మావేశం …

Read More »

బాల‌ల భ‌ద్ర‌మైన భ‌విత‌కు కిశోరి వికాసం

– ఈ నెల 1 నుంచి జూన్ 11 వ‌ర‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – కౌమార బాల‌బాలిక‌ల సాధికార‌త దిశ‌గా ప‌య‌నం – కెరీర్ గైడెన్స్‌, నైపుణ్యాభివృద్ధి, సైబ‌ర్ భ‌ద్ర‌త‌పైనా అవ‌గాహ‌న క‌ల్పించండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కౌమార ద‌శ‌లోని బాల‌బాలిక‌ల స‌మ‌గ్ర అభివృద్ధి, భ‌ద్ర‌త, ఆత్మ‌విశ్వాసం, విద్య‌, ఆరోగ్య అవ‌గాహ‌న త‌దిత‌రాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ల‌క్ష్యంతో కిశోరి వికాసం ప్రత్యేక వేస‌వి శిబిరాల కార్య‌క్ర‌మాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. …

Read More »

డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ‌తో స‌మ‌గ్ర ఆరోగ్య భ‌ద్ర‌త‌

– అర్హులైన లబ్ధిదారులకు పూర్తిస్థాయి నగదు రహిత వైద్య సేవలు – ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో నాణ్యమైన చికిత్స – ఇగ్నైట్ సెల్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఎంప్యానెల్ చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో న‌గ‌దు ర‌హిత నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ …

Read More »

క్రైమ్ హర్రర్ నేపథ్యంలో ఉత్కంఠ భరితంగా సాగే అద్భుత కథ చిత్రం “‘ఊరి చివర”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైమ్, హారర్ నేపథ్యంలో సాగుతూ ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను అలరించే చిత్రం “ఊరి చివర” చిత్రమని హీరో, నిర్మాత మద్దూరి విజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌ లో “ఊరి చివర” సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం లో చిత్ర హీరో విజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి, హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, మొత్తం మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. దేశం …

Read More »