Breaking News

Daily Archives: July 15, 2026

“సుజనా ఫౌండేషన్ ” ఉచిత వైద్య శిబిరం అభినందనీయం

-సీపీఐ నేత నారాయణ , సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి , “సుజనా ఫౌండేషన్” ద్వారా న్యాయవాదుల ఆరోగ్య రక్షణ కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి నారాయణ, సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ అన్నారు. బుధవారం, విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి వారు విచ్చేసి వైద్య సేవలను పొందారు. …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ఆశీస్సులతో సెంట్రల్ నియోజకవర్గం పాత గవర్నమెంట్ ప్రసూతి హాస్పిటల్లో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమానికి ఉమా అన్నయ్య తనయుడు బోండా రవితేజ అన్నదాన కార్యక్రమాని వచ్చి వడ్డన చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఈ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగే అన్నదాన కార్యక్రమానికి స్వయంగా ట్రస్ట్ మెంబర్స్ ఎంతో రుచికరంగా క్వాలిటీ గా వండి ప్రతి ఒక్కరికి ఎంతో …

Read More »

ఆయుష్ వైద్యానికి హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

-ఆయుర్వేద‌, యునాని, నేచురోప‌తి క‌ళాశాల‌లు, ఇంటిగ్రేటెడ్ ఆసుప‌త్రుల‌తో ప్రాచీన వైద్యానికి పునర్ వైభవం -1500 ఆయుష్ డిస్పెన్స్‌రీల ఆధునికీక‌ర‌ణ ప‌నులు -మొత్తం రూ. 414 కోట్ల వ్యయo -ఔష‌ధ మొక్క‌ల పెంప‌కానికి ప్రోత్సాహం -వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ వైద్యానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను హ‌బ్ గా మారుస్తున్నామని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అత్యంత నిరాద‌ర‌ణ‌కు గురైన ప్రాచీన ఆయుష్ వైద్యానికి …

Read More »

ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ లో జిల్లా క్రీడాకారిణుల ప్రతిభ

-2 రజత, 7 కాంస్య పతకాలతో జిల్లా ఖ్యాతిని చాటిన మహిళా అథ్లెట్లు -క్రీడాకారులకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో జూలై 4, 5 తేదీలలో నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ – సౌత్ జోన్ 2026 పోటీలలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, అండమాన్ & నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళ, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక …

Read More »

నిరంతరాయంగా బుడమేరు కాలువ ప్రక్షాళన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు బుడమేరు కాలువ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ శ్రీ సూర్యకుమార్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబాపురం ప్రాంతంలో లాంగ్ ఆర్మ్ సహాయంతో కాలువలో పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్కులు, కలుపు మొక్కలు, తేలియాడే వ్యర్థాలను తొలగించే పనులను చేపడుతున్నారు. అలాగే ప్రతిరోజూ బోట్ల సహాయంతో కాలువలో తేలియాడే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర అవాంఛనీయ పదార్థాలను తొలగిస్తూ నీటి ప్రవాహానికి …

Read More »

చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సేవలు అభినందనీయం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా డాక్టర్ కె. అర్జునరావు అందించిన సేవలు ప్రశంసనీయమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సాధారణ బదిలీలలో భాగంగా సివిల్ సర్జన్ డాక్టర్ కె. అర్జునరావు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్ (కమ్యూనికేబుల్ డీజీసెస్ కంట్రోల్ ప్రోగ్రాము )గా బదిలీ అయిన సందర్భంగా బుధవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని …

Read More »

వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, వేముల శ్యామలాదేవి రోడ్, ఏలూరు రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడు రోడ్, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రత, వ్యర్థాల తరలింపు పరిశీలించారు. అనంతరం అజిత్ సింగ్ నగర్‌లోని …

Read More »

ఆగస్టు 17న రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద రైతుల ఆందోళనలు

-అన్ని పంటలకూ ఉచిత బీమా వర్తింపజేయాలి! -వాతావరణ ఆధారిత బీమా గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలి! -ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని పంటలకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని మరియు రైతుల వాటా బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని దాసరి భవన్‌లో నేడు …

Read More »

అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదు : కలెక్టర్ డీకే బాలాజి

-తాడిగడపలో 14 మంది ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష -నాట్ ట్రేసబుల్, అన్ కలెక్టబుల్, అనామలీస్ ఫారాలపై క్షుణ్ణ పరిశీలన -ఫారాలను జూలై 20 లేదా 21లోపు సమర్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా పూర్తి చేసి, ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్, …

Read More »