-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులు విజయవంతానికి జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 320 రెవెన్యూ గ్రామ పంచాయతీల పరిధితో పాటు విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, తిరువూరు పట్టణ వార్డు సచివాలయ పరిధిలో ఈనెల 6వ తేదీన రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు ఒక్కోక్క మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ తెలిపారు.
రెవెన్యూ సదస్సుల పర్యవేక్షకులు వీరే :
1. ఏ కొండూరు మండలం ` డా. యం హనుమంతరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి.
2. గంపలగూడెం ` డి.వి.వి.ఎస్.ఎన్ రాజు, ప్రాజెక్టు డైరెక్టర్ మెప్మా
3. విసన్న పేట శ్రీమతి చక్రణి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి
4. రెడ్డిగూడెం పి.బాలాజీ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి
5. తిరువూరు ఏ. రాము, ప్రాజెక్టు డైరెక్టర్ డ్వామా
6. జగ్గయ్యపేట జి.మహేశ్వరరావు, అడిషనల్ ప్రాజెక్టు కో`ఆర్డినేటర్, సమగ్ర శిక్ష
7. వత్సవాయి యు. శ్రీనివాసరావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి
8. పెనుగ్రంచుపోలు ఏ కృష్ణ చైతన్య, జిల్లా లీగల్ మెట్రోలజి అధికారి
9. నందిగామ జి. ఉమాదేవి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి
10. చంద్రర్లపాడు బి. నాగరాజు,
డిప్యూటి డైరెక్టర్ గ్రౌండ్ వాటర్
11. కంచికచర్ల టి.వి. సతీష్, డియం సివిల్ సప్లయి అధికారి
12. వీరుళ్ళపాడు పి.యం. సుబాణి, ప్రాజెక్టు డైరెక్టర్ ఏపియంఐపి
13. జి కొండూరు ఏ పాపరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి
14. మైలవరం పి. లావణ్య కుమారి, జిల్లా పంచాయతీ అధికారి
15. ఇబ్రహింపట్నం
టి. సత్యనారాయణ,
సూపరింటిండెంట్ ఇంజనీర్
ఆర్‌అండ్‌బి
16. విజయవాడు రూరల్
జి. కపూర్, జిల్లా హౌసింగ్
అధికారి
17. విజయవాడు సెంట్రల్
ఏ. రవీంద్రరావు, ఫారెస్ట్
సెటిల్‌మెంట్ అధికారి
18. విజయవాడు నార్త్
జెడ్. రమేష్, ఎస్‌ఇ,
పంచాయతీరాజ్
19. విజయవాడు వెస్ట్
ఎస్. విద్యాసాగర్, ఎస్‌ఇ,
ఆర్‌డబ్యుఎస్
20. విజయవాడు ఈస్ట్
డి. చంద్రశేఖర్, అడిషనల్
కమీషనర్ వియంసి
పై అధికారులను రెవెన్యూ సదస్సుల పర్యవేక్షకులుగా నియమిస్తూ కలెక్టర్ లక్ష్మిశ ఉత్తర్వులు జారీ చేశారు.
Prajavartha Online Telugu News