Breaking News

ఈ నెల 8న ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌

– జిల్లాలో ప‌దికేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు
– డీఈవో యూవీ సుబ్బారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 8వ తేదీన నేష‌న‌ల్ మీన్స్ క‌మ్ మెరిట్ స్కాల‌ర్‌షిప్స్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్‌) ప‌రీక్ష ఉద‌యం 10 గంట‌ల నుంచి ఒంటిగంట వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాలో ప‌రీక్ష ప‌ది కేంద్రాల్లో జ‌రుగుతుంద‌న్నారు. జెడ్‌పీ హైస్కూల్ (నందిగామ‌), శ్రీ విద్య హైస్కూల్ (రైతుపేట‌, నందిగామ‌), శ్రీ చైత‌న్య హైస్కూల్ (రైతుపేట‌, నందిగామ‌), జెడ్‌పీ గ‌ర్ల్స్ హైస్కూల్ (న‌డిమి తిరువూరు), గ‌వ‌ర్న‌మెంట్ హైస్కూల్ (తిరువూరు), కేబీసీ జెడ్‌పీ బాలుర హైస్కూల్ (ప‌ట‌మ‌ట‌, విజ‌య‌వాడ‌), కేఎస్ఆర్ జెడ్‌పీ బాలిక‌ల హైస్కూల్ (ప‌ట‌మ‌ట‌లంక‌, విజ‌య‌వాడ‌), ఏకేటీపీ ఎంసీ హైస్కూల్ (ఎస్ఎన్ పురం, విజ‌య‌వాడ‌), ఎంకే బైగ్ ఎంసీ హైస్కూల్ (ఏఎస్ న‌గ‌ర్‌, విజ‌య‌వాడ‌), గాంధీ మునిసిప‌ల్ హైస్కూల్ (వ‌న్ టౌన్‌, విజ‌య‌వాడ‌)లో ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. మొత్తం 2,248 మంది విద్యార్థులు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *