Breaking News

రైతులకు – వినియోగదారులకు మేలు చేకూర్చే చర్యలు

-కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయి ధర కథనాలపై మంత్రి అచ్చెన్నాయుడు చర్యలు 
-రైతుల నుంచి మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు 
-కిలో 8/- చొప్పున కొనుగోలు చేసి అదే ధరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో విక్రయాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయికి ధర పడిపోయిందనే కథనాలపై మంత్రి అచ్చెన్నాయుడు చర్యలు చేపట్టారు. లాభ నష్టాలు లేకుండా కిలో టమాటా రూ.8/- కి కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో అదే ధరకు విక్రయించాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, తక్కువ ధరకు వర్షాధార నాసిరకం టమాటా మార్కెట్లో అందుబాటులో ఉండడంతో సాధారణ టమాటా ధరపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అటు రైతులకు ఇటు వినియోగదారులకు మేలు జరిగే విధంగా మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు విక్రయాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *