Breaking News

జిల్లాలో ఆధార్ నమోదు కానీ సుమారు 17 వేల మంది 0-6 ఏళ్ళ లోపు చిన్నారులు

-దశలవారీగా 84 బృందాలు 4 ఫేజ్ లలో తమ విధులను క్షేత్ర స్థాయిలో నిర్వర్తిస్తాయి
-పేరు, పుట్టిన తేదీ సర్టిఫికేట్‌తో ఆధారంగా ఆధార్ నమోదు ప్రక్రియ
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా 0-6 ఏళ్ళ మధ్య ఉన్న పిల్లలకి ఆధార్ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లాలో సుమారు 17 వేల మంది 0-6 మధ్య పిల్లలు వివిధ కారణాలు వల్ల ఆధార్ సంఖ్య లేని వారు ఉండే అవకాశం ఉందని అంచనా కు రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జనవరి 6 వ తేదీ నుంచి 10 వ తేది వరకు 0-6 మధ్య వయస్సు ఉన్న పిల్లలకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈమేరకు మండల అభివృద్ది అధికారులు , క్షేత్ర స్థాయిలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాలు వారీగా అంగన్వాడిల వివరాలు తో కూడి రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగిందన్నారు.

పేరుతో కూడిన “పుట్టిన తేదీ సర్టిఫికేట్”
ఆధార్ నమోదు సమయంలో చిన్నారుల జన్మ ధ్రువీకరణ పత్రం పేరుతో కూడినది తీసుకొని, తండ్రి లేదా తండ్రి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో నమోదు చేసే సిబ్బంది ని కలిసి ఎన్రోల్ చేసుకోవలసి ఉంటుందన్నారు. ఈ ఆధార్ నమోదు కార్యక్రమంలో వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు మరియు డిజిటల్ అసిస్టెంట్ ఆయా సచివలయాల పరిధిలో విధులను నిర్వర్తించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆ ఆధార్ క్యాంపులు జరుగు తున్నప్పుడు వారికి ఇతరత్రా ఏ విధమయిన పనులు గానీ,సర్వేలు అప్పగించరాదన్నారు . ప్రత్యేక ఆధార్ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆధార్ సంబంధిత ఉద్యోగులకి, సిబ్బంది కి ఎటువంటి సెలవలు మంజూరు చేయరాదని క్షేత్ర స్థాయి అధికారులకు కలెక్టరు స్పష్టం చేశారు.

తొలిదశలో 84 బృందాలు 6 వ తేది నుంచి 10 వ తేదీ వరకూ క్షేత్ర స్థాయిలో మునిసిపల్ లేదా మండల పరిథిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న సచివాలయాలలో సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏరోజు ఎక్కడ ఉంటారో మండలం కేంద్రంలోని కార్యాలయాల్లో, సచివాలయంలో నోటీసు బోర్డ్ లో ప్రదర్శించడం తో అంగన్వాడీ, గ్రామ వార్డు సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆధార్ సంఖ్య ఆధారంగానే సంక్షేమ పథకాల అమలు జరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు స్వచ్ఛందంగా ఆధార్ సంఖ్య పొందాలని సూచించారు. పిల్లలకి పేరు తప్పనిసరిగా ఉండాలనీ లేని సంబంధిత అధికారులను సంప్రదించి పుట్టిన తేదీ సర్టిఫికేట్ లో పేరు ను చేర్చి ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుందన్నారు.

రాజమండ్రి అర్బన్ (11),  రాజమహేంద్రవరం (7) రూరల్, రాజానగరం (7) ,  కోరుకొండ (5) , గోకవరం (4)  , సీతానగరం (2) , కడియం (4) , నల్లజెర్ల (5) , దేవరపల్లి (3) ,  బిక్కవోలు (5) , చాగల్లు (5) ,  తాళ్లపూడి (4) , అనపర్తి (4) , నిడదవోలు అర్బన్ (3) ,  నిడదవోలు రూరల్ (1) , గోపాలపురం (4) ,  ఉండ్రాజవరం (1) , రంగంపేట (2) ,  పెరవలి (4)  కొవ్వూరు (అర్బన్) 1 , కొవ్వూరు రూరల్ (1).

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *