-పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయరామరాజు.వి IAS.,
-ఆరు రోజుల పాటు కేజీబీవీ టీచర్లకు ఇండక్షన్ ట్రైనింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీచర్లు తరగతి గదికే పరిమితం కాకుండా నాణ్యమైన విద్యను సృజనాత్మకంగా బోధించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు, వారి జీవితం, నడవడిక, సత్ప్రవర్తనపై దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయరామరాజు.వి IAS., అన్నారు.
ఆదివారం విజయవాడలో ఆంధ్రాలయోలా కాలేజీ ఎస్-జె సెంటర్లో కేజీబీవీ టీచర్లకు జరుగుతున్న ఆరు రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరో శిక్షణ కేంద్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి హీల్ ప్యారడైజ్ సెంటర్లో కూడా జరుగుతుంది. రెండు కేంద్రాల్లో దాదాపు 252 మంది కేజీబీవీ టీచర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి మంచి భావితరాన్ని అందించాలంటే ఉపాధ్యాయ లోకం చేతిలోనే ఉందన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదికి వెళ్ళేముందు బోధన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నిత్య విద్యార్థిలా రోజూ కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నారు. కేజీబీవీల్లోనే ఎక్కువ కాలం బాలికలు గడుపుతారు కాబట్టి వారిని టీచర్లే తల్లిదండ్రుల్లా కాపాడుకోవాలని కోరారు. వారి ఆరోగ్యం, భద్రత గురించి విద్యార్థులు మనసు విప్పి మాట్లాడేలా స్నేహభావంతో మెలగాలని కోరారు.
అమ్మలాంటి లాలన అందించాలి: ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,
అనంతరం సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కేజీబీవీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని, కేజీబీవీ విద్యార్థులను అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విద్యార్థులకు బోధనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీచర్లను భర్తీ చేశామని అన్నారు. ఏఐ, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ వంటి అంశాల్లో శిక్షణకు ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీలు ప్రతి విద్యార్థికి నెలకు రూ.1400 నుండి 1600లకు పెంచామన్నారు. కౌమారదశలో బాలికలకు అమ్మలా లాలించి వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలని వాటిని పరిష్కార దిశగా ప్రయత్నించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ సెక్రటరీ డి.దేవానందరెడ్డి, ఇగ్నస్ పెహల్ ప్రతినిధులు సురేంద్ర, శ్రీరామ్, తుషార్, Leadership For Equity (ఎల్ ఎఫ్ ఈ) సహ వ్యవపస్థాకులు సిద్దేశ్, బృందం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News