గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చేయటంతో పాటు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ తో కృషి చేస్తున్నారని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్ధికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.
శనివారం స్థానిక శ్రీనివారావుతోటలోని ఏ కన్వేక్షన్ హాలులో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంత్సోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్ధికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ డా. ఎ మల్లిఖార్జున, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, శాసనసభ్యులు గళ్లా మాధవి, కన్నా లక్ష్మీ నారాయణ, ఎండీ నసీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, రాష్ట్ర గౌడ కార్పోరేషన్ చైర్మన్ గురు మూర్తి, వడ్డేర, వెనుకబడిన తరగతుల సంఘాల నాయకులతో కలసి పాల్గొన్నారు . జయంతోత్సవ సభను మంత్రి ఎస్ సవిత జ్యోతివెలిగించి ప్రారంభించి, వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్ధికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరంలో బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న పోరాటం చేశారన్నారు. 1845 సంవత్సరంలో దాదాపు 9000 మంది సైనికులను బ్రిటిష్ వారితో పోరటానికి సిద్ధం చేశారన్నారు. దేశ స్వాతంత్ర్య సమరంలో వడ్డేర కులస్థుల పాత్రను ప్రజలందరికీ తెలియచేయాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర , జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేశారన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికే ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించగా అదే స్పూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీసీలకు రూ.39,007 కోట్లు అత్యధిక కేటాయింపులు చేసిందన్నారు. వడ్డేర లతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన మహానుభావుల సేవలను గుర్తిస్తూ వారి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటానికి, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయటానికి రాష్ట్ర బడ్జేట్ లో బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి బీసీ సంక్షేమ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ నిర్వహించటానికి తొలి సంతకం చేస్తే బీసీ సంక్షేమ శాఖ బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా 26 జిల్లాలలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇవ్వటానికి తొలి సంతకం చేయటం జరిగిందన్నారు. త్వరలోనే ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ కోచింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు. బీసీల స్వయం ఉపాధి పధకాల కోసం బీసీ కార్పోరేషన్ ద్వారా 1,33,849 లబ్ధిదారులకు రూ.1977.53 కోట్లు కేటాయించారన్నారు. దీనిలో భాగంగా మిని డెయిరీ యూనిట్లకు 12,278 లబ్ధిదారులకు రూ.605.47 కోట్లు, గొర్రెలు, మేకలు యూనిట్లకు 2,772 లబ్ధిదారులకు రూ. 52.81 కోట్లు, జనరిక్ మెడికల్ షాపులకు 792 లబ్ధిదారులకు రూ. 61.72 కోట్లు తదితర ఉపాధి పథకాలకు బ్యాంకు లింకేజీతో రాయితీతో ఆర్ధిక సహయం అందిచనున్నామన్నారు. కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాత ప్రభుత్వమని స్పీకర్ తో పాటు, కీలక శాఖలకు చెందిన ఎనిమిది మంది మంత్రులు, ఆరుగురు ఎంపీలు బీసీ వర్గాలకు చెందిన వారే అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది ఉన్నతాధికారులుగా బీసీ వర్గాలకు చెందిన వారిని నియమించారన్నారు. వడ్డే ఓబన్న స్పూర్తితో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గత ప్రభుత్వాన్ని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటంలో వడ్డేర కులస్థులు ఎంతో కృషి చేశారన్నారు. రాళ్ళు కొట్టే వృత్తిలో నుంచి వచ్చిన నాకు వడ్డేర కులస్థుల కష్టాలు పూర్తిగా తెలుసు అని, వారు మాట ఇచ్చితే ఎంత కష్టమైన నెరవేరుస్తున్నారన్నారు. వడ్డేరలను ఎస్టీలలో చేర్చే అంశంతో పాటు, వారి ఉపాధికి అవసరమైన జీవోలు అమలు, మైనింగ్ క్వారీలలో రిజర్వేషన్లు కల్పించటం, శాసన మండలి, నామిటేడ్ పదవులలో ప్రాధన్యత కల్పించాల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకులు,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి సానుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎక్కడ లేనివిధంగా ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు రూ. 4000 లకు పెచంటం జరిగిందని, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయటంతో పాటు, ఉచిత ఇసుక విధానం ద్వారా ఉచితంగా ఇసుకను అందిస్తుందన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారని, పరిశ్రమలు వస్తున్నాయని ఉపాధి అవకాలు మెరుగు అవుతున్నాయన్నారు. గుంటూరు నగరంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కమిషనర్ డా. ఎ మల్లిఖార్జున మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో వడ్డే ఓబన్న చేసిన పోరాటాలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిల్లోను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జేట్ లో రూ 39,007 కోట్లు కేటాయిందన్నారు. గత ఏడు నెలలుగా బీసీల సంక్షేమానికి 17 రకాల స్వయం ఉపాధి పధకాల కోసం బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాలు మంజూరుకు రూ.1977.53 కోట్లు కేటాయించటం జరిగిందన్నారు. బీసీ యువతకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ప్రతి జిల్లాలో మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణతో పాటు రాష్ట్ర స్థాయిలో సివిల్స్ కు శిక్షణ అందిస్తున్నామన్నారు. బీసీ విద్యార్దులకు 104 బీసీ హాస్టల్స్ లో ఎస్సార్ శంకరన్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటుతో పాటు, సంక్షేమ వసతి గృహాల మైనర్ రిపేర్లుకు నిధులు కేటాయించటం జరిగిందన్నారు. వెనుకబడిన తరగుతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి ఉద్యమ వీరుడు వడ్డే ఓబన్న జయంతోత్సవాలను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వడ్డే ఓబన్న స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు కీలకమైనవన్నారు. వెనుకబడిన తరగతుల జనాభాలో రెండవ స్థానంలో ఉన్న వడ్డేర కులస్థులు సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వడ్డేరలను ఎస్టీ లలో చేర్చటానికి 2014 – 19 లో ప్రత్యేక కమిటీని వేయటం జరిగిందని, దానిని తిరిగి పునరుద్ధరించాలన్నారు. వడ్డేరలకు మైనింగ్ క్వారీలు, కాంట్రాక్టు పనులలో రాయితీతో పాటు రాజకీయ పదవులలో ప్రాధన్యత ఇవ్వాలన్నారు.
సభకు అధ్యక్షత వహించిన గుంటూరు పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యులు గళ్లా మాధవి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయేధులు వడ్డె ఓబన్న జయంతిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా రాష్ట్ర , జిల్లా స్థాయిలో నిర్వహించటం వెనుకబడిన తరగతులకు అఖండ గౌరవంగా భావిస్తున్నామన్నారు. వడ్డె ఓబన్న ఉయ్యాలవాడ నరిసింహారెడ్డికి కుడి భుజంగా ఉండి స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టేలా పోరాటాలు చేశారన్నారు. అదే స్పూర్తితో గత ప్రభుత్వ ఆరాచక పాలనను విముక్తి కలిగించటంలో వడ్డెర కులస్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సహకారం అందించారన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా సుపరిపాలన చేస్తుందన్నారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా వడ్డెర కులస్థులను అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, యువనాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో రైతులు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం వడ్డె ఓబన్న ప్రాణాలు పణంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడన్నారు. ఆయన స్పూర్తిని , త్యాగాలను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఎండీ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గణనీయమైన పాత్ర పోషించారని, ఆయన జయంతిని రాష్ట్ర , జిల్లా స్థాయిలో అధికారికంగా చేపట్టాలన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. స్వాతంత్ర్య సమరంలో వడ్డెర కులస్థుల పోరాటాలు, త్యాగాలు ప్రజలకు తెలియచేయటానికి ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వ నిర్వహిస్తుందన్నరు. నందమూరి తారకా రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి వడ్డేర కులస్థులు అంకితభావంతో పార్టీలో పనిచేస్తున్నారన్నారు. ఇతర వర్గాలతో సమానంగా వడ్డెరల అభివృధ్దికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సువర్ణ యుగం వంటి కూటమి ప్రభుత్వ పాలనలో బీసీలు ఐక్యంగా కృషి చేయాలన్నారు.
హిందుపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఫోన్ లో సందేశమిస్తూ స్వాతంత్ర్య సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి సంధర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నరు. వడ్డే ఓబన్న స్వాతంత్య్రపోరాటాలు, త్యాగాలను స్పూర్తిగా తీసుకొని ఆయన అశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు.
రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం చైర్మన్ గురు మూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో వడ్డే ఓబన్న పాత్ర చాలా కీలకమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, స్వయం ఉపాధి పధకాలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గుంటూరు నగరంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నరు. నగరపాలక సంస్థ కాంట్రాక్టు పనులలో వడ్డేరలకు ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వడ్డె ఓబన్న వారసులు బాల నరిసింహులు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ అధ్యక్షులు కేసన శంకరరావు, వడ్డేర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డేర వెంకట్, రాష్ట్ర వడ్డెర సంఘ విభాగం జనరల్ సెక్రెటరీ మల్లేశ్వర రావు, వడ్డెర సంఘ ప్రతినిధులు దేవళ్ళ మురళి, నరసింహం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాయపాటి అరుణ, పమ్మిశెట్టి రమాదేవి, గుత్తి నరిసింహులు, ఈశ్వరరావు, అంజప్ప, టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్యసమరయోధులు వడ్డె ఓబన్న స్వాతంత్ర్యసమరంలో చేసిన పోరాటాలు, త్యాగాలు ప్రజలందరికి తెలిసేలా ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర స్థాయిలో జయంతి ఉత్సవాలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వడ్డే ఓబన్న కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయటంతో పాటు, ఐదు ఎకరాల స్థలంలో వడ్డేర భవనంను నిర్మించాలన్నారు. వడ్డేరలకు రాజకీయ, సామాజిక, ఆర్ధికంగా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో వడ్డే ఓబన్న వారసులు వడ్డే బాల నరిసింహులను మంత్రి ఎస్ సవిత సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, వడ్డేర, వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …