-డి ఆర్వో టి సీతారామ మూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో అధికారికంగా వడ్డే ఓబన్న జన్మదిన వేడుకలను జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియ చేశారు. స్థానిక కలెక్టరేట్ లో శనివారం ఉదయం వడ్డే ఓబన్నా జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంలో గ్రామీణుల శ్రమ, నిరంకుశ వైఖరీ, అధికంగా పన్నుల వసూళ్ల చెయ్యడం పై వారి పక్షాన నిలబడి ఎదురొడ్డి నిలిచిన సంచార జాతుల కుటుంబానికి చెందిన వ్యక్తీ వడ్డే ఓబన్నా అన్నారు. దేశ స్వాతంత్ర్య సమరం లో ఎందరో వారి ప్రాణాలను ఎదురొడ్డి నిలవడం జరిగిందని, చరిత్ర లో తెలియని ఎందరో ఉన్నారని , అటువంటి వ్యక్తుల్లోవడ్డే ఓబన్నా ఒకరన్నారు. సంచార జాతుల కుటుంబానికి చెందిన వడ్డే ఓబన్నా జయంతి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఈరోజు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వడ్డెర తొలి స్వతంత్ర సమరయోధుడు రేనాటి సౌర్యుడు బ్రిటిష్ వారి కదంబ ఆస్తాల నుంచి మన దేశ స్వతంత్ర ము కొరకు పోరాటం చేసిన యోధుడు అయినా వడ్డెర ఓబన్న గారి 217 వ పుట్టినరోజును బిసి సంక్షేమ శాఖ ఆధ్వరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి బి శశాంక పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి బి. శశాంక, గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.