-కార్పొరేషన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆఖరి తేదీ జనవరి 28
-ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్పొరేషన్ లోనే రిజిస్ట్రేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాయకాపురం కాలనీస్ మరియు కొత్త రాజరాజేశ్వరి పేటలో ఇంకాను వెయ్య బి-ఫామ్ పట్టాల రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉన్నవి కాబట్టి వాటి ప్రక్రియను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లను ఏర్పాటు చేశారని ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా యజమానులుగా ఉంటున్న వారికి గజం 100 రూపాయలకు రిజిస్ట్రేషన్ చేయుటకు జనవరి 28వ తేదీ చివరి తేదీని, ఆసక్తి గల ప్లాట్ ఓనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేసి జనవరి 16 నుండి 28 వరుకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోగలరని అన్నారు .ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారో, వారు వారితోపాటు ఇంటి పట్టా, లింక్ డాక్యుమెంట్స్, యజమాని ఆధార్ కార్డ్, ఇంటి పన్ను రసీదు, ఇద్దరు సాక్షులు వారి ఆధార్ కార్డులతో ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోగలరని తెలిపారు.
Prajavartha Online Telugu News