Breaking News

పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద యువతకు ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యం పెరుమళ్ళా రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ టాప్ – 500 కంపెనీలో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే పథకం లక్ష్య మన్నారు. అభ్యర్థులు రెగ్యులర్ కోర్సుల్లో నమోదై ఉండకూడదని, ఆన్ లైన్ దూర విద్య కోర్సులను అభ్యసిచవచ్చుని వెల్లడించారు. ప్రస్తుతం ఫుల్ టైం ఉద్యొగం చేస్తున్న వారు అనర్హులనీ తెలియ చేశారు. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదని, ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదన్నారు. పదో తరగతి, పాలిటెక్నిక్, ఐ టి ఐ, బీ ఏ, బీయస్సీ, బీ-ఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీ చదివి ఉండి, అభ్యర్థుల వయస్సు 21 నుండి 24 వయసు ఉన్న వారు అర్హులు అని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ 5,000 స్టైఫండ్ ఇస్తారు అని తెలిపారు.

ఆసక్తి ఉన్నవారు … https://pminternship.mca.gov.in/login/ వెబ్ సైట్ లో 2025 జనవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *