అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, పద్మశ్రీ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని జనవరి 18న రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించాలి. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అని భావించి తెలుగుదేశంపార్టీని స్థాపించి బడుగు, బలహీన వర్గాల వారికి అండగా నిలబడిన ఎన్టీఆర్ వర్ధంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. సమాజానికి ఉపయోగపడేటువంటి పలు సేవాకార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ నాయకులు పనిచేయాలి. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులు అర్పించాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Tags amaravathi
Check Also
ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్
-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …
Prajavartha Online Telugu News