-తిరుపతి జిల్లాలో మూడు కేంద్రాలలో 1242 మంది అభ్యర్థులు హాజరు : జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22,23,24,28,29 మరియు 30 తేదీలలో నిర్వహించనున్న JEE (Main) 2025 పరీక్షల కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. JEE (Main) 2025 పరీక్షలు 3 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతందన్నారు. 22, 23, 24, 28, 29 తేదీలలో మొదటి షిఫ్ట్ ఉదయం 9 గం.ల నుండి మధ్యాహ్నం 12. గం.ల వరకు రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గం. నుండి సాయంత్రం 6 గం.ల వరకు 30 వ తేది రెండవ షిఫ్ట్ 3 గంటల నుండి 6.30 గంటలకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఉదయం 8 గంటల 45 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు మాత్రమే పరీక్ష కేంద్రానికి హాజరు కావలి అని తెలిపారు. జిల్లా లో మూడు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నామని మరియు ఈ పరీక్ష కేంద్రాల కు రవాణా శాఖ వారిచే రైల్వే మరియు బస్ స్టేషన్ ల నుండి బస్సు సౌకర్యములు ఏర్పాటు చేయడమైనది మరియు పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, గదులు, త్రాగు నీరు, లైటింగ్ తదితర వసతులు కల్పించాలని రవాణా శాఖ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు దృషి పెట్టాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతి లేదని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వివరాలు:
1. అయాన్ డిజిటల్ జూ పార్క్, చెర్లోపల్లి, తిరుపతి – 928
2. అయాన్ డిజిటల్ జూ పార్క్, కె ఎం ఎం రామిరెడ్డిగారి పల్లి చంద్రగిరి తిరుపతి- 229
3. ఎన్.బి.కె.ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్, విద్యా నగర్ కోట మండలం- 85
Prajavartha Online Telugu News