Breaking News

సెపక్‌ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను విజయవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు సమన్వయంతో సెపక్‌ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం సెపక్‌ తక్రా అండర్‌ ` 14 బాలురు / బాలిక జాతీయ పాఠశాల క్రీడల నిర్వహణపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెపక్‌ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను ఈనెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు స్థానిక పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడలను విజయవంతం చేసేందుకు విద్యాశాఖకు చెందిన పాఠశాల హెచ్‌యంలు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, నగర పాలక సంస్థ, పోలీస్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య కమిటీ సభ్యులు సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ క్రీడలకు 12 రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరు కానున్నారని టోర్నమెంట్‌ విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని డిఆర్‌వో లక్ష్మీ నరసింహాం ఆదేశించారు.
అనంతరం సెపక్‌ తక్రా జాతీయ పాఠశాల క్రీడలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి సుబ్బారావు, స్టేట్‌ స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరి బానుమూర్తి రాజు, డిస్టిక్ట్‌ స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరి శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *