Breaking News

ఆర్జీల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాదాన్యత ఇవ్వండి..

-జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌కు 144 అర్జీలు
-జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను నిర్దేశ గడువులోగా పరిష్కరించే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టరేట్‌ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ లక్ష్మీశ.. డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 144 అర్జీలురాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 43, ఎంఏయూడీకి సంబంధించి 60, పోలీస్‌ 8, పంచాయతీరాజ్‌ 7, సర్వే 4, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ 3, ఉపాధి కల్పన 2, అటవీ 2, హెల్త్‌ 2, హౌసింగ్‌ 2, ఇరిగేషన్‌ 2, ఏపీసీపీడీసీఎల్‌ 1, ఏపీఎస్‌ఆర్‌టీసీ 1, సిఇవో జిల్లా పరిషత్‌ 1, కో`ఆపరేటివ్‌ 1, పౌర సరఫరాలు 1, డ్వామా 1,విద్యా 1, గనులు అండ్‌ భూగర్భ శాస్త్రం 1, సోషల్‌ వెల్ఫేర్‌ 1, చొప్పున అర్జీలు వచ్చాయి. ఈ అర్జీలను నిర్దేశ గడువులోగా పరిష్కరించేందుకు కృషిచేయాలని కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వీటితో పాటు అన్‌లైన్‌లోను నమోదు అవుతున్న ఆర్జీలను ప్రతి రోజు పరిశీలించి పెండిరగ్‌ లేకుండా పరిష్కరించాలన్నారు. గడువులోగా పరిష్కారం కాని వాటికి తగిన కారణాలను ఆర్జీదారునికి వివరించాలన్నారు. గడువుతీరిన ఆర్జీల పెండిరగ్‌ ఏ శాఖలోను నమోదు కాకూడదని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *