Breaking News

అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేయాలని, పనులను ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టితో పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఏటి అగ్రహరం, అంకిరెడ్డి పాలెం, నల్లపాడు, సైనిక పురి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పననకు జిఎంసి అధిక ప్రాదాన్యత ఇస్తుందన్నారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఆ దిశగా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుకు ముందే చేపట్టిన అభివృద్ధి పనులను నేరుగా పరిశీలిస్తామన్నారు. పనుల్లో నాణ్యత లోపాలు గమనిస్తే సంబందిత కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్టు లో పెట్టడంతోపాటు, పర్యవేక్షణ అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తొలుత ఏటి అగ్రహారం మస్టర్ పాయింట్ ని పరిశీలించి కార్మికుల, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, జీరో బ్లాక్ స్పాట్స్, తడిపొడి వ్యర్ధాల విభజన జరిగేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
పర్యటనలో డిఈఈ సతీష్ కుమార్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *