Breaking News

17 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికకు 17 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు గారు శుక్రవారం తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఫిబ్రవరి 3న ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 22 నుండి 24 వరకు 17 మంది నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. నామినేషన్లను ఈ నెల 27న ఉదయం 11 గంటల నుండి స్క్రూట్నీ చేసి, అనంతరం అర్హత కల్గిన నామినేషన్లను ప్రకటిస్తామని తెలిపారు. నామినేషన్లను వరుసగా పోతురాజు సమత, కొమ్మినేని కోటేశ్వరరావు, దాసరి లక్ష్మీదుర్గ, తేలుకుట్ల హనుమాయమ్మ, ముప్పవరపు భారతి, నూకవరపు బాలాజీ, షేక్ మీరావలి, ఈరంటి వర ప్రసాద్, షేక్ రోషన్, యాట్ల రవి కుమార్, అచ్చాల వెంకట రెడ్డి, అడకా పద్మావతి, రాజలత బూసి, అంజలి మర్రి, పఠాన్ రిహాన, దూపాటి వంశీబాబు, గోపి శ్రీనివాస్ లు దాఖలు చేశారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *