Breaking News

రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ పరిదిలో గల PSC బోస్ డ్రైవింగ్ స్కూల్ మరియు అన్నపూర్ణ హెవి మోటార్ డ్రైవింగ్ స్కూల్ నందు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా శుక్రవారంనాడు భారీ వాహనాల శిక్షణ పొందుతున్న విద్యార్థులతో రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏ కార్యక్రమంనకు ముజ్య అతిధిగా నందిగామ ఆర్టీఓ
యం. పద్మావతి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆర్టీఓ యం.పద్మావతి మాట్లాడుతూ వాహనాలను అతి వేగముగా నడపడం ఓవర్టేక్ చేయడము వలన ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయని,, ఓవర్టేక్ చేసేటప్పుడు ముందు వెనుక గమనించుకుంటు వెళ్ళాలని ఆమె అన్నారు. అతివేగం ప్రమాదకరమని వేగాన్ని తగ్గించుకొని వాహనాన్ని నడపాలన్నారు. ప్రతిఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించే వాహనాలను నడపాలని అప్పుడే ప్రమాదాలు భారిన పడకుండా కాపాడుకోగలమని ఆమె అన్నారు.

జగ్గయ్యపేట మోటార్ వాహన తనిఖీ అధికారి MVN రాజు మాట్లాడుతూ వాహనాలు రాంగ్ డైరక్షన్ లో వెళ్ళడం సింగల్ రోడ్డు లో ఓవర్ టేక్ చెయ్యడం అత్యంత ప్రమాదకరమని అన్నారు, మత్తు పదార్ధాలు సేవించి వాహనాలు నడపకూడదని అన్నారు. నందిగామ మోటార్ వాహన తనిఖీ అధికారి యం. పూర్ణిమ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించే దిశగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తదుపరి నందిగామ బైపాస్ రోడ్డు నందు పోలీస్ మరియు రవాణాశాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ పైన అవగాహన కార్యక్రమం జరిగినది అని తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో నందిగామ ఏసీపీ తిలక్, సి ఐ వై వి వి నాయుడు, యస్ ఐ అభిమన్యు, ట్రాఫిక్ యస్ ఐ నరేష్, ప్రాంతీయ రవాణా శాఖాధికారి యం.పద్మావతి , మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవి నారాయణరాజు, మోటార్ వాహన తనిఖీ అధికారి యం. పూర్ణిమ, పరిపాలన అధికారి BSK ప్రభాకర లింగం, PSC బోస్ మేనేజర్ సుభాని, PSC బోస్ డ్రైవింగ్ స్కూల్ విధ్యార్ధులు, అన్నపూర్ణ డ్రైవింగ్ స్కూల్ విధ్యార్ధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *