గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు శనివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలన్నారు. చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ శనివారం సాయంత్రం పరిశీలిస్తారన్నారు. వ్యవసాయం , హార్టి కల్చర్ , విద్య , వైద్య శాఖ, హౌసింగ్ , ఆర్ డబ్ల్యూ ఎస్. డీఆర్డీఏ , మెప్మా , పంచాయితీ రాజ్ , సివిల్ సప్లయిస్ , జియంసీ , ట్రాన్స్ కో , ఐసీడీఎస్ , అగ్నిమాపక శాఖల అధికారులతో మాట్లాడుతూ శకటాలను ఆకర్షణీయంగా రూపొందించి పెరేడ్ లో ప్రదర్శించేందుకు సిద్దపరచాలన్నారు. మైక్రో ఇరిగేషన్ , పశుసంవర్ధక శాఖ, హ్యాండ్ లూమ్స్ , సోషల్ వెల్ఫేర్ , అన్ని వెల్ఫేర్ శాఖలు , డిజేబుల్ వెల్ఫేర్ , మత్స్య శాఖ, డ్వామా , నైపుణ్యాభివృద్ది మరియు ఉపాధి కల్పన శాఖధికారులు ప్రభుత్వ పధకాలు ఉట్టిపడేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. దేశ భక్తిని ప్రతిబింబించే విధంగా విద్యార్దులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు డిఈఓ తగు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ఎలాంటి విద్యుచ్ఛక్తి అంతరాయం లేకుండా విద్యుత్ శాఖధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెరేడ్ గ్రౌండ్ నందు విద్యార్దులు , స్వాతంత్ర్య సమరయోధులు , జిల్లా ప్రముఖులు , అధికారులు , మీడియా వారు , ప్రజలు ఆశీనులు అయ్యేందుకు అవసరమైన గ్యాలరీల ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు పకడ్బంధీగా చేపట్టాలని సూచించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ను అందంగా తీర్చిదిద్ది పరిశుభ్రతతో పాటు పోలీస్ కవాతు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమన్వయ పరచుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ త్రాగునీరు , స్నాక్స్ ఏర్పాటు చేయాలని డి ఎస్ ఓ కోమలి పద్మ కు జిల్లా సంయుక్త కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ షేక్. ఖజావలి , డిప్యూటీ కలెక్టర్ గంగరాజు , ఆర్డిఓ శ్రీనివాస రావు, జెడ్పి సిఇఓ జ్యోతిబసు, పీడీ డీఆర్ డీ ఏ , విజయలక్ష్మీ , పీడీ డ్వామా శంకర్ , పీడీ హౌసింగ్ ప్రసాద్, సిపిఓ శేషశ్రీ , డిఈఓ రేణుక , డిఎస్ ఓ కోమలి పద్మ, జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మీ , జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వెంకటేశ్వర్లు , జీయంసీ అదనపు కమిషనర్ ఓబులేశు, డీడీ మైన్స్ అండ్ జియాలజీ డి. శ్రీ వెంకట సాయి , డీడీ హార్టి కల్చర్ రవీంద్ర, డీటీసీ సీతారామి రెడ్డి, పశు సంవర్ధక శాఖ జే.డి నరసింహా రావు , జిల్లా ఉపాధి కల్పన అధికారి దుర్గాబాయి , ఎల్ డి యం మహిపాల్ రెడ్డి , గుంటూరు తూర్పు, పశ్చిమ తహశీల్దార్లు నగేష్, వెంకటేశ్వర్లు , ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ ప్రకాష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News