Breaking News

అగ్నిప్రమాదం వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే కార్యక్రమంలో పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్నిప్రమాదం వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాధ్ తో కలసి మార్కెట్ యార్డు దుగ్గిరాలలో రైతుల యొక్క స్టోరేజి బాండులను పరిశీలించడం జరిగింది. మొత్తం 299 రైతులకు గాను 250 మంది రైతులు తమ ఒరిజనల్ బాండు , ఆధార్ కార్డు , బ్యాంక్ అకౌంటు పత్రాలను సమర్పించడమైనది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ , గుంటూరు వారు , రెవెన్యూ మరియు మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొని పత్రాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి మార్కెట్ యార్డ్ కార్యదర్శి , సహాయ మార్కెటింగ్ సంచాలకులు రాజబాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *