తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల(SVCC Degree College,Tirupati) నందు జాబ్ మేళా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ వి సి సి డిగ్రీ కళాశాల, తిరుపతి ( SVCC Degree College,Tirupati) నందు 27-01- 2025 అనగా ఈ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును.
జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: SVCC Degree College,Balaji Colony,Tirupati.
ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన శ్రీరామ్ ఫార్చ్యూన్, ముత్తూట్ గ్రూప్ , అరీఎస్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
విద్యార్హతలు: పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు అర్హులు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో పాటు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా నమోదు చేసుకొని కచ్చితంగా అడ్మిట్ కార్డు తో జాబ్ మేళాకు హాజరవ్వవలెను అని ఆర్ లోకనాథం గారు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తిరుపతి జిల్లా వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/
మరిన్ని వివరములకు 918074919939 మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.
గమనిక: జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను.
Prajavartha Online Telugu News