Breaking News

చారిత్రక సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం జన్మ గృహాన్ని పర్యటక ప్రదేశంగా అభివృద్ది చేయ్యాలి

-ఆనాటి ఘటనలు కళ్ళకి కట్టినట్టు త్రీడి ఎఫెక్టు ప్రదర్శన ఏర్పాటు చెయ్యండి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కందుకూరి వీరేశలింగం జన్మ గృహాన్ని చారిత్రిక జ్ఞాపకాలు, ఘటనలు భవిష్యత్ తరాలకు అందించటానికి అనువుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ది చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.

స్ధానిక వంకాయల వారి విధిలో ఉన్న సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మ గృహాన్ని మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు, కార్పరేషన్ అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం, వారసత్వ సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం పంతులు వారి జన్న గృహాన్ని అభివృద్ది చేసి, సందర్శకులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ గృహాన్ని ఆనాటి స్మృతులు చెక్కు చెదరకుండా అభివృద్ది పనులు చేపట్టడం ముఖ్యం అన్నారు. అదే సమయంలో ఈ గృహాన్ని సందర్శించడానికి వొచ్చే వారికీ ఆనాటి ఘటనలు అద్దం పట్టే విధంగా త్రీడి ఎఫెక్టు తో కూడిన ఒక ఫిల్మ్ డాక్యుమెంటరీ కూడా సిద్దం చేసి, ప్రదర్శించాలని స్పష్టం చేశారు. మండువా లోగిలిలో కూడిన ఈ చారిత్రక ఆధారాలు, ఆనాడు కందుకూరి వీరేశలింగం ఉపయోగించిన వస్తువులు, ప్రదేశాల్లో సజీవ సాక్ష్యం నిలిచే ఆకృతులలో అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. రాజమహేంద్రవరం ఒక పర్యటక, ఆధ్యాత్మిక, సాంసృతిక రాజధానిగా తనదైన ముద్ర వేసుకున్న దృష్ట్యా జిల్లాలోని దర్శనీయ స్థలాలో కందుకూరి వీరేశలింగం వారి జన్మ గృహాన్ని సందర్శించే పర్యాటకులకు ఒక చక్కటి జ్ఞాపకంగా మిగిలి ఉండేలా పనులు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్శనలో వితంతు వివాహ ఘట్టం, సమావేశ మందిరం, సమాలోచన మందిరం, వివేకా వర్థిని పుస్తకం ముద్రణ యంత్రాన్ని, లైబ్రెరీ, నివాస ప్రాంతం, ప్రదేశాలను మునిసిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించి, అధికారులకి సూచనలను సలహాలను ఇవ్వడం జరిగింది. అక్కడ చేతి వ్రాతతో ఉన్న ప్రదర్శన ను తిలకించడం జరిగింది.

మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ వివరాలు తెలియ చేస్తూ, పురావస్తు శాఖ, రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో చారిత్రక ఆధారాలు దెబ్బతినకుండా కాపాడుతూ, భవిష్యత్తు తరాలకు అందించటానికి అనువుగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పర్యటన లో మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు,
ఆర్ ఎమ్ సి ఎస్ ఈ – జి. పాండురంగ రావు,  ఆర్ ఎమ్ సి ఈ ఈ ఆలీ, ఈ ఈ మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *