Breaking News

ప్రశాంతంగా మెయిన్స్ మూడోవ రోజు పరీక్షల నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2025 జనవరి 24 న మెయిన్స్ మూడోవ రోజు పరీక్షల నిర్వహణను అత్యంత పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జె ఈ ఈ మెయిన్ -2025 పరీక్షలు ION డిజిటల్ జోన్ IDZ లూథర్‌గిరి, రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, లూథర్‌గిరి, రాజమహేంద్రవరం నందు మూడో రోజూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. జె ఈ ఈ మెయిన్స్ పరీక్ష లకి హాజరయ్యే అభ్యర్థులు 24-01-2025 షిఫ్ట్-1 ఉదయం 885మందికి గానూ 870 మంది హజరు కాగా 15 మంది గైరాజరు అవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న ఒక విభిన్న ప్రతిభావంతులు పరీక్షలకు హాజరు అయ్యారు. షిఫ్ట్ 2 మధ్యాహ్నం పరీక్ష లకి 886 మందికి గానూ 882 మంది హజరు కాగా 4 మంది గైరాజరు అవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న ముగ్గురు విభిన్న ప్రతిభావంతులు పరీక్షలకు హాజరు అయ్యారు. పరీక్షా కేంద్రంలోకి ఏటువంటి ఎలక్ట్రానిక్ గడ్జెట్స్, వస్తువులను అనుమతించడం జరగదన్నారు. పరీక్షా కేంద్రం ఆవరణలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.  పరీక్ష ప్రారంభం అయ్యే అరగంట ముందు వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి స్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *