Breaking News

నందమూరి బాలకృష్ణకు పద్మ‌భూషణ్..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. కళల విభాగంలో ఆయన చేసిన సేవలకుగానూ.. బాలకృష్ణ పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు 2025ను ప్రకటించింది. మొత్తం 139 మందికి కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించ‌గా… ఇందులో 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు.. సీనియర్ హీరోయిన్ శోభన, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌లకు కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది. వైద్యరంగం నుంచి తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి, క్రీడారంగం నుంచి పీఆర్‌ శ్రీజయ్‌కు పద్మవిభూషణ్‌ అవార్డులు ప్రకటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *