-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొంత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల క్షేమం ఎంతో ముఖ్యమైనదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజపురం, క్రీస్తు రాజపురం, చిట్టినగర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో గల కొండలను జియాలజిస్టులతో ప్రత్యేకమైన పరీక్షలు చేయించి వాటి నివేదికలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి చిట్టినగర్ లోగల స్వరంగం ను పరిశీలించారు, స్వర్గంగం నుండి కారుతున్న నీటి సమస్యను అరికట్టే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్ )పి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.