-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాలను గజం కేవలం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 30 ఆఖరితేదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నారు. పాయకాపురం, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కేటాయించిన పట్టాలను గజం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుందని, ఇంకా ఇళ్ళ రిజిస్ట్రేషన్లు ఎవరివైతే చేయించుకోవాలో జనవరి 30 తేదీ కల్లా ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరని, ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.