Breaking News

స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

-పథకాల సబ్సిడీ మంజూరుకు ఏపీ – ఓబి ఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోండి..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బీసీ, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ మంజూరు చేసేందుకు దరఖాస్తుదారులు ఏపీ ఓబి ఎంఎంఎస్ ద్వారా ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరంలో బి.సి. కార్పోరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పోరేషన్లకు సంబంధించిన లబ్దిదారులకు బిసి కార్పోరేషన్, కృష్ణా వారి ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు గాను, దరఖాస్తుదారులు AP-OBMMS ద్వారా వారి పేరును online లో నమోదు చేసుకొనుటకు ఈనెల 30 వ తేదీ నుండి ఫిబ్రవరి 7 వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. బి.సి.కార్పోరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు నియమ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయని వివరించారు. పట్టణ ప్రాంతము వారి ఆదాయము రూ.1,03,000/- మరియు గ్రామీణ ప్రాంతము వారి ఆదాయము రూ.81,000/- లేదా అంతకంటే తక్కువగా ఉండాలని,

21 నుండి 60 సం. ల మధ్య వయసు గలవారు అర్హులని,

తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆదార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని,

ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులని,

వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

పైన తెల్పిన అర్హతలున్న వారు https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ (ఆన్ లైన్) నందు ఫిబ్రవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాంస్కతిక వారసత్వాలకు చిహ్నంగా ‘లేపాక్షి’

-సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా నిర్మాణాలు -రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షో రూమ్ ల్లోనూ మరమ్మతులు -ఎస్పీఏవీతో ఏపీహెచ్డీసీ ఒప్పందం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *