గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ పేదల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడానికి సిటి లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ కమిటి ప్రణాలికలు రూపొందిస్తుందని కమిటి చైర్మన్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో సిటి లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ కమిటి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), దీన దయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ మార్గదర్శకాల మేరకు నగరాల్లో పేద ప్రజలందరికీ వారి సామర్ధ్యం, నైపుణ్యం ఆధారంగా జీవనోపాధిని కల్పించి, ఆయా కుటుంబాల తలసరి ఆదాయం పెంచడానికి నగర కమిషనర్ చైర్మన్ గా ఉన్న సిటి లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ కమిటి కృషి చేస్తుందన్నారు. నగరాల్లో పేదల జీవితాల్లో వెలుగులు నింపే కృషిలో కమిటి సభ్యులు అంకితభావంతో ఉండాలన్నారు.
సమావేశంలో ఉపా సెల్ పిఓ రామారావు, ఎన్ఐ ఎంఎస్ఎంఈ నుండి రాజేంద్ర ప్రసాద్, డిసిపి సూరజ్ కుమార్, ఏఎంహెచ్ఓ రాంబాబు, రవి పాల్గొన్నారు.
