విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయం వద్ద పిబ్రవరి 8వ తేది నుండి 14 వరకు మందులకు లొంగని దీర్ఘకాల జబ్బులకు, ఆరోగ్యం, ఆనందం, మరియు పూర్ణ ఆయుషు, కొరకు 7 రోజుల యోగ శక్తి చికిత్స మరియు శిక్షణ కార్యక్రమం ఎర్పాటు చేసినట్లు యోగ శక్తి చికిత్స రూపకర్త డా. మాకాల సత్యనారాయణ తెలిపారు. నాడీ పరీక్ష ద్వార మూల సమస్య నిర్దారించి,మనలో ప్రాణ శక్తి ని పెంచటం, అందని విబాగాలకు అందేలాగ చేయటం మరియు వేడి మరియు చలువ (శివ పార్వతి) తత్వవాలను సమ స్తితికి తేవడం, పంచ బూతాల వలె పని చేసే 12 అవయావాలను సమానంగా పని చేసే లాగ చికిత్స చేయటం ద్వార అరోగ్యాన్ని ఇవ్వటం తో పాటు ఇక ముందు రుగ్మతల బారిన పడకుండ వుండే లాగ శిక్షణ ఇవ్వటం జరపనున్నట్లు తెలిపారు. ఎలాంటి మందులు వాడకుండ, సైడ్ ఎపెక్టు లేకుండ, సర్జరీ లను నివారించే లాగ హోలిసస్టిక్ ( బాడి -మైండ్ -ఆత్మ) విదానంతొ, అసహజ మరణాలను తగ్గించేలాగ ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విరిగినవి, తెగినవి మరియు తీవ్రమైన వ్యాధిగస్తులు రావద్దని తెలిపారు. భారత ప్రదాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిట్నెస్ మంత్ర ఈ విదానంలొ బాగమే. ఈ 7 రోజుల చకిత్స మరియు శిక్షణ లో చేరగోరు వారు ముందుగ పేర్లు నమోదు చేయించు కోవటానికి సెల్ 9000347369 సంప్రదించగలరని తెలిపారు.
