అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రిపబ్లిక్ న్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకమైన అభినందనలతో ధన్యవాదములు. ఈ నెల 2025 ఫిబ్రవరి మాసంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి మన పార్టీ నుండి ఎవరు అయినా పోటీ చేసే ఆలోచన ఉంటే కేంద్ర మంత్రి సామాజిక న్యాయశాఖ మరియు సాదారిక జాతీయ అధ్యక్షులు రాందాస్ అత్వల్ హైదరాబాదులో వివాహం సందర్భంగా మరియు క్రైస్తవుల మైనార్టీల కార్యకర్తల మీటింగ్ కు హాజరుకానున్నారు పోటీ చేసే అభ్యర్థులు మీ యొక్క బయోడేటా మీయొక్క వివరములు కేంద్ర మంత్రి కి ఇవ్వగలరని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ ఓ ప్రకటనలో కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి..మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది.