-మాస్టర్ ప్లాన్ లో పొందు పర్చాల్సిన అంశాలపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై ఎమ్మెల్యే సుజనాచౌదరి సమీక్షించారు. తాడిగడప లోనిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్ లు, మరియు టెక్నికల్ టీం తో ఎమ్మెల్యే బుధవారం సమీక్ష నిర్వహించారు … భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి, భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు రాకుండా ఉండటానికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు.. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో పొందుపరచవలసిన అంశాలను అధికారులు ఎమ్మెల్యే సుజనా చౌదరి వివరించారు.. భక్తులకు మెరుగైన వసతులను, సౌకర్యాలను కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.. అందుకు సంబంధించిన కొన్ని సూచనలను ఎమ్మెల్యే సూచించారు.. గతంలో పెట్టిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలను పొందు పర్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈ ఈ లు టి వైకుంఠరావు, కె వి ఎస్ ఆర్ కోటేశ్వరరావు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ శ్రీ రమేష్, శ్రీనివాస్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.