-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజక వర్గానికి సంబంధించి ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘము మరియు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశానుసారం ఈ రోజు అనగా 29 వ తేదీ బుధవారం నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) జిల్లా వ్యాప్తంగా తక్షణమే అమలులోకి రావడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అమలులో ఉంటుందని కావున జిల్లాలోని అందరు అధికారులు, ఉద్యోగులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్ధులు ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు పూర్తిగా పాటించి, జిల్లాలో ఎన్నికల నిర్వహణ సక్రమంగా సజావుగా జరుగుటకు సహకరించవలసినదిగా కోరటమైనదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ ఆ ప్రకటనలో తెలిపారు.