అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, ఎస్పీ, ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ , ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం అమ్మవారి ఆలయం లో ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. జనవరి 31వ తేదీన జరగబోయే వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న సందర్భంగా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు, భద్రతా చర్యలలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ అధికారులను ఆదేశించారు.
