తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
భావితరాలకు చరిత్రను దృశ్యరూపం లో అందించాలని దర్శకుడు రత్నాకర్ అన్నారు.
ఐదు ఏళ్ల శ్రమించి తెనాలి లో జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని పరిశోధన చేసిన ప్రతిఫలమే వీరస్థలి తెనాలి సాధించిన విజయమని రత్నాకర్ తెలిపారు. హైదరాబాదుకు చెందిన సుమిత్ మీడియా మోర్డ్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరి చిత్రంగా వీరస్థలి తెనాలిని ఎంపికచేసినట్లు రత్నాకర్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సత్యన్నారాయణ టాకీస్ రోడ్డు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్
కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెనాలి సమీపంలోని కంచర్లపాలెం గ్రామనికి చెందిన స్వతంత్ర సమరయోధులు చుక్కపల్లి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన వీరస్థలి తెనాలి చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తరపున అవార్డు దక్కడంపట్ల చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకులను అంతమొందించాలన్న చుక్కపల్లి రామయ్య చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం రామయ్యపై మరణదండన విధిస్తారు. విషయం తెలుసుకున్న ప్రముఖ న్యాయవాది టంగుటూరి ప్రకాశం పంతులు తెనాలి చేరుకుని రామయ్యపై విదించిన ఉరిశిక్ష కేసును వాదించి జీవిత ఖైదుగా మలుస్తారు. ఈ నేపద్యంలో జరిగిన చుక్కపల్లి రామయ్య యదార్ధ జీవిత చరిత్రను ఐదేళ్లు రీసెర్చ్ చేసి దృశ్య కావ్యంగా మలిచినట్లు రత్నాకర్ వివరించారు. తెనాలి చరిత్రను వీరస్థలి తెనాలిగా మలిచి ప్రజామన్ననలు పొందామన్నారు.సహజత్వం, 1920 నాటి గ్రామీణ వాతావరణం, నాటి ప్రజా ఉద్యమాలను, సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ క్రీడలను అద్భుతం గా చూపిన ఫలితంగా ఉత్తమ ఫ్రీడం ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా వీరస్థలి తెనాలి ఎంపికైనట్లు పేర్కొన్నారు. తన స్వీయ దర్శకత్వంలో , జ్ఞాన శేఖర్ గల్లా నిర్మాతగా చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. తన తదుపరి ప్రాజెక్టు శిశిరం సినిమా ను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఫిబ్రవరి 9న హైదరాబాదు పొట్టిశ్రీరాములు విశ్వ విద్యాలయంలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించి అవార్డు ప్రదానం చేయనున్నట్లు చిత్ర మాటలు రచయిత అయినాల మల్లేశ్వరరావు తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులతో కలసి అవార్డు అందుకోబోతున్నట్లు చెప్పారు. దేశ చరిత్రను దృశ్య కావ్యంగా మలిచిన రత్నాకర్ మీరెన్నో అవార్డులు పొందాలని సీనియర్ పాత్రికేయులు బొల్లిముంత కృష్ణ మాస్టారు అన్నారు. కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, బడుగు మోహనరావు, దర్శి జీవన్ శ్రీ, తులసి, సంజీవరావు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు ఎస్.ఎస్. జహీర్, పట్నాల సాయి, పి. పున్నయ్య, అంబటి శ్యామ్ సాగర్, మునిపల్లి శ్రీకాంత్, ప్రకాశరావు, మహేష్, మదు, వి. భూషణం, శేఖర్, రవికిరణ్, కోటేశ్వరరావు, మేకల సుబ్బారావు, ఫెడరేషన్ సభ్యులు, సినీ కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్, కిరణ్, హేమంత్, కనపర్తి బెన్ హర్, చిత్ర నటీనటులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దర్శకుడు జన్మదినోత్సవం సందర్భం గా శుభాకాంక్షలు తెలిపారు.
