Breaking News

బీసీల పక్షపాతి చంద్రబాబు… : శొంఠి శివరామప్రసాద్ గౌడ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లు శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్,భాస్కర్ గౌడ్ లు మాట్లాడుతూ ఎన్నికల హామీలు భాగంగా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో 10% గౌడ కులస్తులకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే గౌడ కులస్తులకు కులవృత్తులు చేసుకొనుటకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై రుణాల అందించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

గత జగన్ రెడ్డి పాలనలో ఐదు సంవత్సరాలలో కుల కార్పొరేషన్లు నిర్వీర్యం చేశాడని, రాష్ట్రంలో ఒక్క గౌడ కుటుంబానికి కూడా మేలు జరగకపోగా, అధికారుల అండతో గీత వృత్తిదారులపై అక్రమ కేసులు బనాయించి, వారిపై దాడులు చేయించి, గీత వృత్తిని నామరూపాలు లేకుండా చేయాలని చూశాడన్నారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీసీ కుల కార్పోరేషన్లకు 896.79 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్రంలోని బీసీలందరూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అన్నారు. ముఖ్యంగా గౌడ కులస్తులకు అన్న ఎన్టీఆర్ దగ్గర నుండి ఈనాటి చంద్రబాబు వరకు గౌడ కులస్తులకు ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. ఆనాడు ఎన్టీఆర్ గారు గౌడ కులస్తుల అభివృద్ధి కొరకు రంపచోడవరం దగ్గర పందిరి మామిడి గ్రామంలో 60 ఎకరాలలో నీరా ప్రాజెక్టు అభివృద్ధి చేయడానికి సంకల్పించారని, ఆ తర్వాత చంద్రబాబు గీత వృత్తి దారులకు చేయూతనివ్వడానికి ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేసి, గీత వృత్తిదారులకు అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే చంద్రన్న బీమా ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ, గీత వృత్తిదారులకు గీత పన్ను లేకుండా రద్దుచేసి, కార్పొరేషన్ల ద్వారా వారి అభివృద్ధి కొరకు సబ్సిడీ రుణాలు అందజేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం కే దక్కిందన్నారు.
కూటమి ప్రభుత్వం గౌడ కుటుంబాల్లో వెలుగులు నింపాలని, పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎన్టీఆర్ విదేశీ విద్య ద్వారా నిధులు వెచ్చించడమే కాకుండా, గౌడ బిడ్డలు వ్యాపారం చేసుకొనుటకు సబ్సిడీ ద్వారా రుణాలు అందజేసి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. నీరా ప్రాజెక్టును ప్రత్యేకంగా తీసుకొని గీత కుటుంబాలను పారిశ్రామికవేత్తలుగా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *