విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇన్కమ్ టాక్స్ స్లాబ్ రేట్లు మార్చాలని, స్టాండర్డ్ డిడక్షన్, ఆదాయ పరిమితి ని పెంచాలని కోరుకుంటున్నామని, కానీ ఎన్ని సంవత్సరాలగా కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో ఎటువంటి ప్రయోజనం కలిగించలేదని తెలిపారు. కానీ 2025 26 సంవత్సరానికి గాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం, కొత్త స్లాబ్ రేట్స్ ఇవ్వడం హర్షదాయకమని, దీనివల్ల ఉద్యోగికి సగటున 50,000నుంచి 70000 వరకు సంవత్సర కాలంలో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ కి వడ్డీ మీద వచ్చే టిడిఎస్ టాక్స్ పరిమితిని 50 వేల నుంచి లక్ష వరకు పెంచడం కూడా కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్యంగా పెన్షనర్స్ కు ఇది మంచి పరిణామాన్ని తెలిపారు. రెండు స్వయం నివాస గృహాల వరకు ఆదాయపు పన్నును బడ్జెట్లో మినహాయింపులు ప్రకటించడం కూడా మంచి చేసే పరిణామాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్టుగా లక్ష కోట్ల రూపాయల వరకు ఆదాయపు పన్ను రాయితీని ఇవ్వటం ద్వారా ఉద్యోగ వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు, పెన్షనర్లకు ఊరట ఇచ్చినట్లు భావిస్తున్నామని ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి A .విద్యాసాగర్ తెలిపారు
Prajavartha Online Telugu News