Breaking News

వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్రం బడ్జెట్

-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశాల చెంతన నిలిపేందుకు వికసిత్ భారత్ విజన్ ను ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది. రాజకీయ అవసరాల కంటే దేశం, ప్రజలు ముఖ్యం అనే కేంద్ర ప్రభుత్వ సమున్నత దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించింది. రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత… ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారు. రూ.10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం వల్ల సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఊతం దొరుకుతుంది. అదే విధంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్ల రుణాలు ఇవ్వడం ద్వారా ఆ వర్గాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. రూ.12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభిస్తోంది. ఈ తరహా సంస్కరణలు కచ్చితంగా మధ్యతరగతి వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయి. పి.ఎం. ధన్ ధాన్య యోజన మూలంగా వెనకబడ్డ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు గిడ్డంగుల నిర్మాణానికి, నీటిపారుదల వ్యవస్థ ఆధునికీకరణ, ఋణ సౌకర్యాలు కల్పన తప్పనిసరిగా రైతులకు ప్రోత్సాహం లభిస్తుంది. కిసాన్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచడం స్వాగతించదగ్గ అంశం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్లోనూ కొనసాగింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం మూలంగా రాష్ట్రానికి జీవనాడి ఆ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం లభించింది. పోలవరం ప్రాజెక్ట్ కి రూ.5,936 కోట్లు, బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు ప్రకటించడం శుభపరిణామం. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. విశాఖ ఉక్కు పరిశ్రమకి రూ.3295 కోట్లు కేటాయించడం ద్వారా ఆ ప్లాంట్ పరిరక్షణ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేశారు. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు ఇవ్వడం ద్వారా పోర్టు సామర్థ్యం పెరుగుతుంది. వాణిజ్య విస్తృతికి ఆస్కారం కలుగుతుంది. 2019-24 మధ్య రాష్ట్రం పాలనపరమైన, ఆర్థికపరమైన విధ్వంసాన్ని అనుభవించింది. ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడుతున్న ఈ తరుణంలో రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదవి తరగతి సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *