విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పి.బి. సిద్ధార్థ కళాశాలకు చెందిన ఎన్.సి.సి. 4 వ ఆంధ్రా బాలికల బెటాలియన్ విద్యార్థినులు బి.గ్రీష్మ, కె.గాయత్రి ఇతర రాష్ట్రాల బాలికల 8 క్యాడెట్‌లతో కలిసి 2 నిమిషాల్లో 12 నృత్య రూపాలను ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇద్దరూ స్థానం సంపాదించారు. జనవరి 27న ఢిల్లీలో జరిగిన పి.ఎం. ర్యాలీలో వారు పాల్గొని ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఎన్.సి.సి ఎ.ఎన్.ఓ. లెఫ్టినెంట్ డా. రోహిణి కుసుమ, 4 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలిందర్ సింగ్ అభినందించారు.
Prajavartha Online Telugu News