Breaking News

మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం…

-ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు కె.వి. శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ విభాగాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అధ్యక్షులు కె.వి. శివారెడ్డి, అన్నారు. అసోసియేషన్ లో భాగమైన మహిళా ఉద్యోగుల విభాగం కార్యవర్గ సమావేశం ఆదివారం గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీజీఓ హోమ్ లో మహిళా సంఘం అధ్యక్షురాలు నిర్మల కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్జీజీఓ సంఘంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే ప్రదేశాలలో వారికి సంపూర్ణ రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకునేలా సంఘం కృషి చేస్తుందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎ. విద్యాసాగర్ ను మహిళా ఉద్యోగులు ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ కుటుంబ జీవితంతో పాటు అసోసియేషన్ కార్యకలాపాలలో సైతం చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని ఉన్నతాధికారులను, మంత్రులను కలిసినప్పుడు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనుభవించిన మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను ఒక్కొక్కటిగా అధిగమిస్తామన్నారు. గతంలో ఒకటో తేదీన జీతాలు వస్తాయో లేదో అని ఆందోళన పడిన ఉద్యోగులు నూతన ప్రభుత్వంలో ఒకటవ తేదీ నాడు జీతాలు అందుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
చైల్డ్ కేర్ లీవ్ ని అందరు మహిళా ఉద్యోగులు ఉపయోగపడే విధంగా ఉండాలని సమావేశంలో మహిళ ఉద్యోగులు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. మహిళ ఉద్యోగులకి ఇచ్చిన ఐదు రోజుల స్పెషల్ క్యాజువల్ ఇవ్వని మెడికల్ డిపార్ట్మెంట్లోని రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు కూడా అమలు అయ్యేటట్టు చూడాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు మీద చర్చ జరిగింది.

అలాగే మిగతా సమస్యలు కూడా దశల వారీగా పరిష్కారమవుతాయన్నారు. సమావేశంలో మహిళా ఉద్యోగ సంఘం కన్వీనర్ మాధవి, రాష్ట్ర కార్యదర్శి తులసి రత్నం, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి జానకి, ఆల్ ఇండియా ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ రాజ్యలక్ష్మి, ఆల్ ఇండియా ఎన్ఈసీ సభ్యురాలు శాంతి శ్రీ, రాష్ట్ర మహిళా విభాగం జిల్లా, తాలూకా, రాష్ట్రస్థాయి కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *