-ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో భారతదేశంలో తొలి సారిగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహకారంతో సీటీ ఎఫ్.ఎఫ్.ఆర్ టెక్నాలజీ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాశ్చాత్య దేశాల్లో ప్రివెంటివ్ కార్డియాలజీ విభాగంలో, డాక్టర్లు గుండె పోటు ముప్పును ముందుగా గుర్తించేందుకు ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ వంటి సాంప్రదాయ పరీక్షలపై ఆధారపడకుండా, ప్రాథమిక రోగ నిర్ధారణ కోసం క్యాల్షియం స్కోర్ మరియు సీటీ యాంజియోగ్రామ్ పరీక్షలను మొదటి ఎంపికగా (గోల్డ్ స్టాండర్డ్) ఉపయోగిస్తున్నారని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియజేశారు. ఇప్పుడు, రోగ నిర్ధారణలో టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ దిశగా, ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటిసారిగా “సీటీ ఎఫ్.ఎఫ్.ఆర్” పరీక్షను అందుబాటులోకి తెచ్చామని తెలియచేసారు.
హెల్త్‌కేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర
అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు, రికరెంట్, మల్టీలేయర్డ్ డీప్ న్యూరల్ నెట్‌వర్క్‌లు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటివి, గుండె, మెదడు, క్యాన్సర్, జీనోమ్, సింగిల్ సెల్ అట్లాస్ వంటి అంశాలకు సంబంధించి హై రెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా వైద్య రంగంలో మరింత ఖచ్చితమైన రోగ నిర్ధారణ మరియు చికిత్సలను అందించడంలో సహాయపడతాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఈ అత్యాధునిక పద్ధతులను వినియోగించడం వలన కార్డియాక్ ఇమేజింగ్‌లో స్పష్టత బాగా మెరుగైంది, ఇది రోగ నిర్ధారణ మరియు చికిత్సలకు ఎంతో సహాయకారిగా ఉందని డాక్టర్.రమేష్ బాబు తెలియచేసారు.
సీటీ యాంజియో ఎఫ్.ఎఫ్.ఆర్. హఠాత్తుగా వచ్చే గుండె సమస్యలను అంచనా వేయగలదా!
గుండె ధమనుల వ్యాధి నిర్ధారణ తర్వాత, 70%-80% సందర్భాలలో జీవనశైలి మార్పులు, బిపి, షుగర్ నియంత్రణ, మరియు చెడు కొలెస్ట్రాల్‌ను 70 mg% కంటే తక్కువగా ఉంచడం ముఖ్య పాత్ర పోషిస్తాయి. కేవలం 20%-30% సందర్భాలలో మాత్రమే బైపాస్ సర్జరీ లేదా స్టెంట్ల అవసరం ఉంటుంది. దీనివలన 80% మందికి క్యాత్ యాంజియో అవసరం పడదని క్యాత్ యాంజియో ఇక కేవలం స్టెంటింగ్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని, రోగ నిర్ధారణ కోసం కాదని తెలియచేసారు.
పేషెంట్‌కు ఛాతీ నొప్పి ఉన్నప్పుడు సీటీ యాంజియో చేయవచ్చా!
ఈసీజీ, ఎకో మరియు ట్రోపోనిన్ పరీక్షలు సాధారణంగా ఉంటే వైద్యుల సలహా ప్రకారం సీటీసిఏ చేయవచ్చని డాక్టర్.రమేష్ బాబు తెలియచేసారు.
ప్రీ-ఎవాల్యుయేషన్ ద్వారా స్పష్టమైన సమాచారం
క్యాత్ ల్యాబ్‌లోకి వెళ్లే ముందు పేషెంట్లకు స్టెంట్లు అవసరమా? ఎన్ని స్టెంట్లు అవసరమవుతాయి? స్టెంట్ సైజ్ ఎంత ఉండాలి? ఇవన్నీ సిటీ యాంజియోగ్రామ్, ఎఫ్.ఎఫ్.ఆర్ (FFR – Fractional Flow Reserve), ప్లాక్ మార్ఫాలజీ (Plaque Morphology) ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు.
పెరివాస్కులర్ ఫ్యాట్ అటెన్యుయేషన్ ద్వారా ప్రగతిశీల విశ్లేషణ
రక్తనాళాల్లో కొవ్వు పొరలో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా? రెండు రక్తనాళాల్లో 70% కంటే ఎక్కువ పూడిక ఉన్నట్లయితే, ఏ రక్తనాళాల్లో కొవ్వు పొర చిట్లే ప్రమాదం ఉందో ముందుగా శాస్త్రీయంగా అంచనా వేయొచ్చు. సీ.ఈ (CE) అప్రూవల్ పొందిన ఈ అత్యాధునిక ఆన్ సైట్ సిటీ యాంజియోగ్రామ్ ఎఫ్.ఎఫ్.ఆర్ పరికరాన్ని, భారత దేశంలో మొట్టమొదటిసారిగా కోస్టల్ కారిడార్‌లో ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో అమర్చారు. ఈ పరీక్ష ద్వారా పేషెంట్ సిటీ స్కాన్ రూమ్ లో ఉన్నప్పుడే స్టెంట్లు అవసరమా లేదా అనే సమాచారాన్ని తేలికగా అందించవచ్చు.
బైపాస్ సర్జరీనా! స్టెంట్సా!
ఈ రెండింటిలో ఏది అవసరమనేది మెయిన్ వెసల్స్ లో మూడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నప్పుడు కొంతమందిలో స్టెంట్స్ సరిపోయినా, అధిక శాతం మందిలో బైపాస్ సర్జరీ వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని శాస్త్రీయ సమాచారం.
స్ట్రెస్ టెస్ట్ అవసరమా! కాదా!
స్ట్రెస్ టెస్ట్ అనేది సీటీ యాంజియోగ్రామ్,క్యాత్ యాంజియోగ్రామ్ గానీ చేసే ముందు కాకుండా అది చేసిన తరువాత అందులో చిన్న చిన్న బ్లాక్స్ ఉండి,లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే స్ట్రెస్ టెస్టుకు వెళ్ళాలని,
ఫస్ట్ లైన్ టెస్ట్ గా 50 శాతం మంది రోగులలో స్ట్రెస్ టెస్ట్ ను ఉపయోగించనవసరం లేదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ తెలియచేస్తున్నాయని డాక్టర్ రమేష్ బాబు తెలియచేసారు.
2011లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 256 స్లైస్ సీటీ స్కానర్‌ను ఏర్పాటు చేసి, సీటీ క్యాల్షియం స్కోర్ మరియు సీటీ యాంజియోగ్రామ్ పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షలు గుండె రక్తనాళాల్లో ఏర్పడే పూడికలను ముందుగానే గుర్తించి గుండె పోటును అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పటి వరకు 30,000 కి పైగా సీటీ యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో 2,000 మందికి పైగా రోగుల్లో తీవ్ర గుండె సమస్యలను ముందుగా గుర్తించి గోల్డెన్ అవర్‌లో తగిన వైద్యం అందించడంతో వారి ప్రాణాలను రక్షించగలిగారు. అలాగే, 25,000 మందికి పైగా రోగుల్లో 10% నుంచి 60% వరకు గుండె రక్తనాళాల్లో పూడికలు (బ్లాకేజీలు) మరియు క్యాల్షియం స్కోర్ 1 నుంచి 1000 వరకు గుర్తించబడగా, వీటిని అదుపులో ఉంచేందుకు మందులు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సూచించడం ద్వారా గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచి వారికి సమర్థవంతమైన ముందస్తు వైద్యం అందించడం జరిగిందని డాక్టర్.రమేష్ బాబు తెలియచేసారు.
ఈ విధంగా, అధునాతన సీటీ స్కాన్ మరియు AI ఆధారిత ప్రివెంటివ్ కార్డియాలజీ ద్వారా గుండె సంబంధిత సమస్యలను ముందుగా గుర్తించి, సమర్థమైన చికిత్స అందించేందుకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గ్రూపులో ఉన్న 30 మంది గుండె వైద్య నిపుణులు మరియు గుండె శస్త్ర చికిత్సా వైద్య నిపుణుల బృందం డాక్టర్.రమేష్ బాబు నేతృత్వంలో పనిచేస్తోంది.
Prajavartha Online Telugu News