Breaking News

జీరో నుండి ఐదు సంవత్సరాల చైల్డ్ ఆధార్ నమోదు…

-5 నుండి 7, 15 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారి ఆధార్లు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పై అవగాహన కల్పించాలి…
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధార్ నమోదు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం (డిఎల్ఏఎంసి) కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ చాంబర్లో నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా జిల్లాలో ఆధార్ నమోదు స్థితిని, ఆధార్ నమోదు కేంద్రాల పనితీరును, ధ్రువీకరణ పెండెన్సీని సమీక్షించారు. వయస్సు గ్రూపుల వారిగా ఆధార్ నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జీరో నుండి ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారుల చైల్డ్ ఆధారపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ముఖ్యంగా జిల్లాలో 38 వేల వరకు పెండింగ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

ఐదు సంవత్సరాలు పైబడిన, 15 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేషన్ (మాండటరీ బయోమెట్రిక్ అప్డేషన్)చేసుకోవలసి ఉంటుందని అన్నారు. ఇందుకు ఇటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా దీనిపై కళాశాలలో అవగాహన కల్పించాలన్నారు. నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి ఎంట్రన్స్ పరీక్షలకు బయోమెట్రిక్ తప్పనిసరి అయినందున వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పై అవగాహన కల్పించాలన్నారు.

ఆసుపత్రిలో పుట్టగానే పిల్లలకు ఆధార్ నమోదు పై దృష్టి పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, అంగన్వాడి కేంద్రాలలో రిజిస్టర్ అయిన వెంటనే తప్పనిసరిగా సర్టిఫికెట్ తెప్పించి ఆధార్ జనరేట్ చేయాల్సిన బాధ్యత మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, గ్రామ వార్డు సచివాలయ అధికారులపై ఉందన్నారు.

అంగన్వాడి కేంద్రాలలో చిన్నారుల ఆధార్ నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు డేట్ అఫ్ బర్త్ లేని వారి వివరాలను సేకరించాలన్నారు. పాఠశాలలో అడ్మిషన్లకు, ప్రభుత్వ పథకాల లబ్ధి, బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయటం, తదితర అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అయినందున ఆధార్ నమోదుపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత, 15 నుండి 17 సంవత్సరాల మధ్యలో వయసు కలిగిన వారికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పై పాఠశాలలు కళాశాలలో గ్రామ, వార్డ్ సచివాలయాలలో తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించి బయోమెట్రిక్ అప్డేషన్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో డిస్టిక్ లెవెల్ ఆధార్ మోనిటరింగ్ కమిటీ కన్వీనర్ కెఆర్సిసి డిప్యూటీ కలెక్టర్ బి. శ్రీదేవి, యు ఐ డి ఏ ఐ అసిస్టెంట్ మేనేజర్ జి గిరిధర్, ఎల్ డిఎం సి. రవీందర్ రెడ్డి, సిడిపిఓ కే. గ్లోరీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *