-శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో మంగళవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా మీడియాతో బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాలకు శాశ్వత పరిష్కారంగా జీవితకాల సమస్యలు ఏమీ లేకుండా పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు, నివాస యోగమైన పట్టాలకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పామని దానికి నిదర్శనం గానే జీవో నెంబర్ 30 ను తీసుకొని వచ్చి 150 గజాల వరకు ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని, అలాగే 151 నుండి 300 గజాలు నామమాత్రం చార్జీ లతో రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుందని, ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పేదవారికి అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అని అన్నారు.
ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జీవో నెంబర్ 30 ప్రకారం మరోతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, సచివాలయ సిబ్బందితో ఇంజుమ్మిరేషన్ చేపించి వారి పేరు, నివాసి స్థలాలు, ఎన్ని గజాలు సర్వేను చేసి వారి అందరికి శాశ్వతంగా లిస్ట్ ఇవ్వబడుతుంది అని, గతంలో 1970 గిరిపురం అనే ఏర్పడింది అని అక్కడ 30, 40 నుండి 50 గజాలు నివాసముండే ప్రాంతాలని ఈరోజుకి 2025 వారికి రిజిస్ట్రేషన్ల సదుపాయం ఏ ప్రభుత్వం కల్పించలేదని తాను శాసనసభ్యులు అయినా మొదటి అసెంబ్లీ సమావేశాలలోనే శాసనసభలో మాట్లాడి తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కూడా కలిశానని, తరువాత రెవెన్యూ సదస్సులు, రాష్ట్రస్థాయి సదస్సులు కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేశానని, మంత్రి అనగాని సత్యప్రసాద్ ని అలాగే అధికారి సిసోడియా ని కలిసి మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపానని దాని ఫలితమే జీవో నెంబర్ 30, అలాగే జీవో నెంబర్ 23 మరియు మరొక జీవో నెంబర్ 27ను కూడా తీసుకొని రావడం జరిగినదని వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నివాస స్థలంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్లు చేయటం జరుగుతుందని అన్నారు.
శాశ్వత నివాసితులందరికీ ఉచిత రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది, దీని ద్వారా వేరే వారికి అమ్ముకోవడం కానీ బ్యాంకు రుణాలు తీసుకోవడం కానీ వెసులుబాటుగా ఉంటుందని అన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిలోనూ, పిల్లలకు చదువు నిమిత్తం, అవసరమైతే ఈ భూముల రిజిస్ట్రేషన్లు ఉపయోగపడుతుందని ఈ జీవాల ద్వారా పూర్తిగా హక్కులు వారికి అందించే విధంగా ఈ జీవోలను ప్రజలందరూ ఉపయోగించుకోవలసినదిగా, దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు సర్వేను చేపించి రిజిస్ట్రేషన్లకి చేపించేందుకు బాధ్యతను తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నాగ వంశ సాధికార కన్వీనర్ ఎరుబోతు రమణ రావు,గార్లపాటి విజయ్ కుమార్ పాల్గొన్నారు.