విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం గత నెల 30 తారీకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరావు పుట్టినరోజు సందర్భంగా SRR కాలేజీలో జరిగిన BPL క్రికెట్ టోర్నమెంట్ లో వల్లభనేని సతీష్ మరియు ఆలా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన (BPL) బొండా ప్రీమియర్ లీగ్ బహుమతులను అందించిన MLA బొండా ఉమామహేశ్వరరావు విజేతలకు అందించడం జరిగింది. విన్నర్స్ బహుమతి 50000 గుణదలకు చెందిన శాండీ సీసీ, రన్నర్స్ బహుమతి 25000 వన్ టౌన్ కి చెందిన భక్షు సీసీ గెలిచారు. ఈ టోర్నీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ తపస్వి సీసీ కి చెందిన జగదీశ్ కి 20000 ప్రైజ్ మని పొందారు. ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 38టీమ్స్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, ఇంచార్జ్ వల్లభనేని సతీష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కారంపూడి సత్య మరియు టీడీపీ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ తోట పాండు, ప్రకాష్ ,డేవిడ్, దాసు, శశి,శివ ప్రసాద్, కట్టా నాగరాజు, సాయి, అమర్ నాధ్, దుర్గారావు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.