విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని బెస్ట్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం జరిగింది. మంగళవారం కస్తూరిబాయిపేటలోని, సుబ్బారాయుడుగారి వీధిలోని బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌నందు ఉచిత వైద్య శిబిరం జరిగిన సందర్భంగా నిర్వాహకులు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం 6వ సారి నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రతినెలా 2 సార్లు నిర్వహించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉత్తమ వైద్యనిపుణులతో ఆర్‌బిఎస్, క్రియాటిన్, హెచ్‌బి రక్త పరీక్షలు, ఎముకల సాంద్రత పరీక్ష, నరాల పరీక్ష, ఊపిరితిత్తులు పరీక్ష తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించి సలహాలు, సూచనలు చేసినట్లు తెలిపారు. డాక్టర్ కె.పవన్‌కుమార్ యాదవ్, డాక్టర్ బి.శ్రీతేజ, డాక్టర్ ప్రణీత్ తిరుమలశెట్టిలు పాల్గొని సహకారాన్ని అందించారన్నారు. భవిష్యత్‌లతో మరిన్ని సేవా కార్యక్రమాలలో భాగంగా పేద, మధ్య తరగతి వారి కోసం తమ హాస్పిటల్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చేస్తున్న కృషిని స్పూర్తిగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఉచితంగా మరిన్ని వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్ని వైద్యసేవలను వినియోగించుకున్నారు.
