Breaking News

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహనతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పాయకపురం, రాజీవ్ నగర్ ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని, వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా ఆంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ మలేరియా వర్కర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *