-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 2 పరిధిలోని గోపాల్ రెడ్డి రోడ్డు , సర్కిల్ 1 పరిధిలోని కెనాల్ రోడ్, సర్కిల్ 3 పరిధిలోని APSRMC స్కూల్ వద్దగల అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
23వ డివిజన్ ఎన్టీఆర్ కాంప్లెక్స్, గోపాల్ రెడ్డి రోడ్డు ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. కాంప్లెక్స్ వద్దగల యూరినల్స్ ను గమనించి గతంలో యూరినల్స్ ను తీసి మరుగుదొడ్లు నిర్మించమన్న ఆదేశాలను ఇప్పటి వరకు చేయలేదని ఆగ్రహించారు. వినాయకుని గుడి, కెనాల్ రోడ్డు, హోల్డింగ్ ఏరియా ప్రాంతం అంత పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా ఉత్సవాలు, భవాని విరమణ లకు వచ్చే భక్తులకు శాశ్వతమైన మరుగుదొడ్లను హోల్డింగ్ ఏరియాలో నిర్మించాలని అందుకనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్నారు. నగరంలో ఉన్న బ్రిడ్జెస్ అన్నిటికిను కంచెలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి పెయింటింగ్ వెయ్యాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాల ని తూచా తప్పకుండా పాటించాలని, రాజకీయ నాయకుల బ్యానర్లు ఫ్లెక్సీలు, తదితర ప్రచారము లను ఎక్కడున్నా సరే తీసేయాలని అధికారులను ఆదేశించారు.
సర్కిల్ 3 పరిధిలోని APSRMC స్కూల్ వద్ద గల అన్న క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు, వాడుక నీటి సరఫరా, మరుగుదొడ్లలో మరమ్మతులు చూసి, ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా పర్యవేక్షించాలని ఎటువంటి మరమ్మతులు, ఏ అన్న క్యాంటీన్లో ఉండకూడదని హెచ్చరించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జి మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News